ఐపీఎల్ – 2024 సీజన్ లో ఈ రోజు 9వ మ్యాచ్ జరగనుంది, రాజస్థాన్, జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లు తలపడనున్నాయి రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ లో లక్నోను సునాయాసంగా ఓడించి రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ కి సిద్ధం అయింది , అన్ని విభాగాలలో పటిష్టంగా ఉండటం కెప్టెన్ శాంసన్ ఫామ్‌లో ఉండడం , సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం కూడా రాజస్థాన్‌కు కలిసివచ్చే అంశం కాగా..
తొలి మ్యాచ్ లో పంజాబ్ చేతిలో పరాభవం పాలైన ఢిల్లీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఈ సీజన్లో బోణి కొట్టాలనుకుంటుంది, ఢిల్లీ ఓపెనర్స్ మంచి శుభారంభం ఇవ్వగలిగితే ఈ జట్టుకు గెలిచే అవకాశాలు ఉంటాయి, రెండేళ్ల గ్యాప్ తరువాత ఈ సీజన్ కి కెప్టెన్ పంత్ అందుబాటులోకి వచ్చాడు, పంత్ కి రాజస్థాన్ రాయల్స్ మీద మంచి రికార్డు ఉంది , ఆడిన 9 ఇన్నింగ్స్ లలో 170 స్ట్రైక్ రేట్ తో 4 హాఫ్ సెంచరీలు చేసాడు , మరి ఈరోజు మ్యాచ్ లో కూడా పంత్ రాణించి తన జట్టు గెలుపుకి ఎలా సహాయపడతాడో వేచి చూడాలి, మొదటి మ్యాచ్ లో బెంచ్ కే పరిమితమైన బ్యాటర్ పృథ్వి షా ను ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశం ఉంది, బౌలింగ్ విభాగంలో అన్రిచ్ నార్త్జే, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ అందుబాటులోకి రావడం ఈ జట్టుకి మంచి పరిణామం
రెండు జట్ల బలాబలాలు చూస్తే రాజస్థాన్ రాయల్స్ కే గెలుపు అవకాశాలు ఎక్కువ, చూద్దాం విజయం ఎవరి వైపు వరిస్తుందో.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) :
రాజస్థాన్ రాయల్స్ :
జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయిర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.
ఢిల్లీ క్యాపిటల్స్ :
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, అన్రిచ్ నార్త్జే, ఖలీల్ అహ్మద్.