నేడు ఐపిఎల్ లో ముంబయికి ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది . పంత్ ఫామ్ లోకి రావడం ఆ జట్టు కి కలిసొచ్చే అంశం. అదే సమయంలో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లలో తడబడినా కొంత నిలదొక్కుకుంది. ప్లే ఆఫ్ స్థానం కోసం పోరాడుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే ముంబయి ఇండియన్స్ కు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. అందుకే నేటి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ కు కీలకంగా మారనుంది.
బలాబలాలు చుస్తే రెండు జట్లు సమ ఉజ్జివులుగానే ఉన్నాయి , విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.