జనసేన-టీడీపీ కార్యకర్తల ఆన్లైన్ వేధింపుల కారణంగా గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గీతాంజలిమృతితో ఆమె ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. ఈ నేపథ్యంలో ట్రోలర్లను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు గీతాంజలిని ట్రోల్ చేసిన ఖాతాల వివరాలను సేకరించారు. కానీ టీడీపీ మాత్రం గీతాంజలి వ్యక్తిగత జీవితాన్ని బయటకు లాగాలని చూసి అభాసుపాలైంది. ఇదిలా ఉంటే గీతాంజలి విషయంలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గీతాంజలి మరణవార్త తెలిసాక గీతాంజలి కుటుంబానికి న్యాయం జరగాలంటే, కారణమైన వారికి కఠిన శిక్షలు పడాలని, గీతాంజలి విషయంలో ఏం జరిగిందీ? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయాలపై దర్యాప్తు చేయాలని, అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి వేధించేవారిని కఠినంగా శిక్షించాలంటూ పూనమ్ కౌర్ ఎక్స్ వేదికగా స్పందించింది.
తాజాగా వైఎస్ షర్మిల గీతాంజలి మరణం గురించి ఎందుకు స్పందించలేదని ఎక్స్ లో ప్రశ్నించింది. తోటి మహిళలు, చిన్నారుల పట్ల జాలి, దయ కలిగి ఉండటం మహిళా నేతల మొదటి, ముఖ్యమైన లక్షణం. గీతాంజలి అంశం మీద వైఎస్ షర్మిల మౌనంగా ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెనాలిలోని సాధారణ మహిళలు, బాలికలు బయటకు వచ్చి పాఠాలు ఇలాంటి వారికి పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉందని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.