గత తెలుగుదేశం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పొచ్చు . చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వైద్యం కోసం పేదలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. బాబు ముఖ్యమంత్రి కాగానే ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చారు కానీ వైద్య సేవలే అందలేదు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా కొత్త కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసే విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.ఒకప్పుడు రూ.5 లక్షలు ఉన్న పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు.
దీనికి సంబంధించి నూతన కార్డులను డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 42 శాతం మందికి అందించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు గానూ ఇప్పటి వరకు 60.43 లక్షల కార్డుల పంపిణీ జరిగింది. కుటుంబ వివరాలు, నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలతో కూడిన సిటిజన్ యాప్ను వలంటీర్లు లబ్ధిదారుల చేత స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయిస్తున్నారు. పంపిణీని మరింత వేగవంతం చేసి త్వరలో నూరు శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.