పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా పేద మహిళలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల స్థలాలను ఇచ్చారు. కేటాయించిన వారి పేరు మీద ఈనెల 2వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కన్వేయన్స్ డీడ్లు ఇస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి 6 లక్షల రిజిస్ట్రేషన్లు దాటాయి.
65 శాతానికి పైగా పూర్తి చేసి బాపట్ల జిల్లా మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో నంద్యాల, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం (55 శాతానికి పైగా) వచ్చాయి. సెలవు దినాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంకో పది రోజుల్లో పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.