హిట్ అనే పదానికి దూరమైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించిన మూవీగా జైలర్ పేరు తెచ్చుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన జైలర్ కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా అనిరుద్ రవించందర్ సంగీతం అందించారు. ముఖ్యంగా నువ్వు కావాలయ్యా, హుకుం సాంగ్ సూపర్ హిట్ గా నిలిచాయి.
కాగా జైలర్ కి సీక్వెల్ పనులు కొనసాగుతున్నట్టు ఈ సీక్వెల్ కి హుకుం అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టబోతున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్ , బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ లు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. సీక్వెల్ లో కూడా వీరు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హుకుం కూడా జైలర్ స్థాయిలో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.