సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరి ప్రియా, అనంతిక, గోపిక లాంటి కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గత సంవత్సరం అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. మ్యాడ్ సినిమా సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మ్యాడ్’లో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ఈ సినిమాలో తిరిగి […]
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని సిద్దు జొన్నలగడ్డను స్టార్ గా మార్చి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా టిల్లు స్క్వేర్ నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటి బాట పట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి […]
హిట్ అనే పదానికి దూరమైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించిన మూవీగా జైలర్ పేరు తెచ్చుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన జైలర్ కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా అనిరుద్ రవించందర్ సంగీతం అందించారు. ముఖ్యంగా నువ్వు కావాలయ్యా, హుకుం సాంగ్ సూపర్ హిట్ గా […]
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఛాతీలో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రిలో చేరారు. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సాయాజీ షిండే గుండెలో బ్లాక్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడటంతో వెంటనే ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాయాజీ షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయని ఆంజియోప్లాస్టీ తప్పదని చెప్పడంతో ఆయన చికిత్స […]
ప్రముఖ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరిల వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాయకస్వామి టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్- అదితి పెళ్లి జరగడం గమనార్హం. కాగా వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లోఅదితిరావు హైదరి కూడా ఒకరు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన సిద్దార్ధ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి చిత్రాలతో […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ వెనువెంటనే ఆర్సీ 17 ను కూడా ప్రకటించడం విశేషం.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విభిన్న చిత్రాలను రూపొందించే సుకుమార్ తో మరోసారి రామ్ చరణ్ పని చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ మూవీని హొలీ సందర్భంగా ప్రకటించడం విశేషం. కాగా గతంలో రామ్ చరణ్ సుకుమార్ […]