వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చారిత్రత్మాక పాదయాత్ర అదే బాటను అనుసరిస్తూ చంద్రబాబు మీ కోసం అంటూ పాదయాత్ర చేశాడు. ఆ రికార్డులు బద్దలు కొడుతూ రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరు పిల్లలు.. వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రరాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. ఆ రికార్డులను బద్దలు కొడతానని పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్ ఆరంభ శూరుడుగా మిగిలిపోనున్నాడు.
ఎందుకంటే 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు రికార్డ్ స్థాయిలో నడుస్తానని 27 జనవరిలో పాదయాత్ర మొదలు పెట్టిన లోకేష్ ఈ నెల 17 న విశాఖపట్నంలో అసంపూర్ణంగా ముగించేస్తున్నారట.. ఇక ఈ మాత్రం దానికి అసలు పాదయాత్ర, దండయాత్ర అంటూ మొదలు పెట్టడం ఎందుకనేది రాజకీయ విశ్లేషకుల మాట..
మొదటి నుండి నారా లోకేష్ కంటూ రాజకీయ ప్రస్థానం అనేలా గొప్పగా చెప్పుకోదగ్గ చరిత్రేమీ లేదు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి తప్పుడు తడకల మాటలతో.. మొద్దబ్బాయి అనే పేరునే సంపాదించుకున్నాడు తరువాత దాన్నే సార్ధకం చేసుకున్నాడు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుండి లాకున్న టీడీపీ పార్టీకి చంద్రబాబు తరువాతి తరం నాయకుడు ఎవరు అనే ఆలోచనను లోకేష్ తన ప్రవర్తనతో నీరుగార్చేసాడు. ఎప్పటికప్పుడు ప్రజల్లో లోకేష్ ని ఎల్లో మీడియా జాకీలు పెట్టి లేపేందుకు గట్టి ప్రయత్నాలే చేసినా ప్రజలు మాత్రం లోకేష్ ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. టీడీపీ వర్గం కూడా లోకేష్ ను పెద్దగా పట్టించుకున్నదీ లేదు..
2019 లో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఓటమి పాలవ్వడంతో పాటు టీడీపీ ఘోర పరాజయంతో అధికారం కోల్పోయాక దాదాపు రెండేళ్లు హైదరాబాద్ కే పరిమితమైన లోకేష్ తరువాత అడపాదడపా జూమ్ మీటింగ్స్, ప్రెస్ మీట్స్ అంటూ హడావుడి చేసినా పస లేని ప్రసంగాలు, అభ్యంతరకర భాషతో సొంత పార్టీ నేతల దృష్టిలో కూడా పలచన కావడంతో నాయకత్వ మార్పు గురించి టీడీపీ కార్యకర్తల నుండీ కొందరు నాయకుల్లో చర్చ జరగడం, జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని డిమాండ్ వినపడసాగింది.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన టీడీపీ.. మళ్ళీ ఎలానైనా 2024 లో అధికారంలోకి వచ్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుంది. పొత్తులు పెట్టుకుంటూ, కులాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. లోకేష్ క్రేజ్ పెంచేందుకు తన చేత పాదయాత్ర చేయించటానికి పూనుకొన్నాడు. పాదయాత్రలో మెసులుకోవలసిన విధానాలలో నడక, నడత, మాటతీరు అన్నింట్లో నెలల తరబడి శిక్షణ ఇప్పించి ఎట్టకేలకు పాదయాత్రకు పంపారు. పాదయాత్రకు ముందు లోకేష్ భారీగా బరువు కూడా తగ్గాడు.
టీడీపీ తన గొయ్యి తానే తీసుకున్నట్టు లోకేష్ తో పాదయాత్ర మొదలుపెట్టించి పాపం లోకేష్ ను ప్రజల మీదకు వదిలింది. అసలు లోకేష్ సొంతంగా ఎప్పుడూ పేదల కష్టాలను దగ్గర నుండి చూసినవాడు కాదు, గ్రౌండ్ లెవల్ రాజకీయాలు తెలిసినవాడు కాదు, ప్రజల కష్టం ఆకలి నుండి మొదలై చావు బ్రతుకుల మధ్య అనారోగ్యమనే నిస్సహాయ స్థితిలో అంతమవుతుందనే కనీస అవగాహన ఉన్నవాడు కాదు.. అలాంటిది అతన్ని ప్రజల్లోకి పంపడం తప్పుడు ఆలోచననే అనాలి మరి.
యువగళం మొదలుపెట్టే ముందు ఆ తరువాత టీడీపీ పార్టీ ఇచ్చిన బిల్డప్, చేసిన హడావిడి పాదయాత్ర ప్రారంభ దశలోనే నీరుగార్చేసాడు లోకేష్. ఏ బహిరంగసభలో మాట్లాడినా తన డొల్లతనం భయటేసుకున్నాడు. రాష్ట్ర రాజకీయల మీద ఆర్ధిక పరిస్థితుల మీద ఎక్కడా స్పష్టమైన అవగాహనలేదని నిరూపించుకుంటూ వచ్చాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా పాదయాత్రలో రోజూ మైకు పట్టుకొనే అవకాశం దక్కించుకొన్న లోకేష్, శిక్షణ ఇచ్చిన అంశాలు మొత్తం మరిచిపోయి యాత్రలో అనుదినం అసభ్య పదజాలం వాడుతూ, జగుప్స కలిగించే చేతి సంజ్ఞలతో సవాళ్లు చేస్తూ, అల్లర్లు సృష్టిస్తూ ఒక దండయాత్రలా పాదయాత్ర చేస్తూ వచ్చాడు. రాష్ట్రం మీద కనీస అవగాహన లేకుండా ఎవరో వేసిన రూట్ మ్యాప్ తో గుడ్డెద్దు చేలో పడినట్టు నడవడమే లోకేష్ పాదయాత్ర. అయితే టీడీపీ అప్పగించిన ఒకే ఒక్క పని నడవడం.. అది కూడా లోకేష్ సరిగ్గా నిర్వర్తించలేకపోయాడనే చెప్పాలి. షెడ్యూల్ పరంగా పాదయాత్ర సాగిన దాఖలాలే లేవు.
జనవరి 27, 2023 లో యువగళం ప్రారంభమైన నాటి నుండి ఇప్పుడు డిసెంబర్ 17, 2023 న ముగియనున్న నాటికి లోకేష్ ఓ రాజకీయనాయకుడిగా ముద్రేసుకునేలా ఎక్కడా మాట్లాడలేదు ప్రవర్తించలేదు . చంద్రబాబు కొడుకుగానే తప్ప, టీడీపీ లీడర్ లా కూడా ఎప్పడూ లోకేష్ నడచుకున్న సందర్భాలు లేవు.
అయితే మూలిగే నక్క నెత్తిన తాటికాయ పడ్డట్టు.. అసలే పాతాళంలో ఉన్న తెలుగుదేశం పార్టీని పైకి తెచ్చేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఎక్కడికక్కడ గ్రూపులు బయటపడి పార్టీని మరింత బలహీనపరుస్తూ వచ్చాయి. జిల్లాల్లో లోకేష్ పాదయాత్రలో స్థానిక నేతల్లో ఉత్సాహం ఏమాత్రం కనిపించలేదు. ఒక పార్టీ ముఖ్య నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడంటే.. ప్రజల సమస్యలు వింటాడని, పార్టీలో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతాడని అందరూ ఆశిస్తారు. అయితే ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాత్రం ఎక్కడ పాదం మోపితే అక్కడ పార్టీ మరింత వీక్ అవుతూ పాదయాత్ర సాగింది.
తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్మమంత్రి వైఎస్ జగన్ ఫ్లెక్సీ చింపమని లోకేష్ సైగ చెయ్యడం, ఓ టీడీపీ కార్యకర్త ఫ్లెక్సీ ని చింపడం, తరువాత టీడీపీ వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య అల్లర్లు చెలరేగడం.. అలాంటి చర్యలతో లోకేష్ పాదయాత్ర సజావుగా సాగిందే లేదు.
లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున స్థానిక నాయకులు వెచ్చిస్తూ జనాన్ని పోగు చెయ్యాలట.. కానీ రెండు వేలు వెచ్చించినా పాదయాత్రలో ప్రజలు కనపడలేదు. లోకేశ్ పాదయాత్రకు తమిళనాడు నుంచి ఆర్టిస్టులను తెచ్చి వారితోనే మాటా మంతీ అంటూ ఫోటోలు, ప్రజలతో కలిసి నడుస్తున్న లోకేష్ అంటూ టీడీపీ జనాన్ని చూపించేందుకు వేసిన పిచ్చివేషాలను సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు ఎండగట్టారు.
యువగళం యాత్ర కృష్ణా జిల్లాలో జరుగుతుండగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో.. పాదయాత్ర ఆపేసిన లోకేష్ రెండు రోజులు హడావుడి చేసి అదే స్కాంలో తాను కూడా అరెస్ట్ అవ్వొచ్చనే అనుమానంతో ఢిల్లీకి పారిపోయాడు. అక్కడే వారాల తరబడి మకాం వేయడంతో స్కిల్ స్కాంలో విచారణ కోసం ఏపీ పోలీసులు ఢిల్లీ వెళ్లి రావాల్సి వచ్చింది.
ఒక్క ఢిల్లీ పారిపోవడమే కాదు, యువగళం మళ్ళీ ప్రారంభిస్తానని షెడ్యూల్ ప్రకటించి మళ్ళీ ఆపేయడం, చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా పళ్లాలు మోగించడం, చేతులకు తాళ్ళు కట్టుకోవడం, ఈలలు వేయడం, డప్పులు మోగించడం, కాగితాలు తగలబెట్టించడం, బైక్ హరన్స్ మోగించడం, పిల్లల చేత బూతులు తిట్టించడం లాంటి చిత్ర విచిత్ర కార్యక్రమాలతో ప్రజల్లో నవ్వుల పాలు కావడమే కాకుండా టీడీపీ శ్రేణుల్లో అసహనం పెరగడానికి కారణమయ్యాడు. ఇలాంటి విచిత్ర నిరసనలు ఎర్రగడ్డలో మాత్రమే ఇప్పటి వరకూ చూశాం తరువాత లోకేష్ పుణ్యమా అని టీడీపీ నేతలు అవే నిరసనలు చెయ్యడం చూశాం.
పాదయాత్ర మళ్ళీ మొదలైన తరువాత ఒక సీనియర్ నేత లోకేష్ తన నియోజకవర్గంలో పాదయాత్ర చెయ్యొద్దంటూ చెప్పినట్టు వార్తలొచ్చాయి. డబ్బు వృధా అవడం, పరువు పోవడం తప్ప లోకేష్ పాదయాత్రతో ఏ ఉపయోగం ఉండదని అందుకే పాదయాత్ర వద్దన్నారట.
నాయకుడు అన్నవాడు చివరి క్షణాల్లో కూడా పోరాడుతూనే ఉండాలి కానీ తన తండ్రి అరెస్ట్ కాగానే చేస్తున్న యువగళం యాత్ర ఆపేయడం, రాష్ట్రం విడిచి పోవడం, తర్వాత వచ్చినా కార్యకర్తలకు సరైన దిశా నిర్దేశం చేయలేకపోవడం, పార్టీ కార్యవర్గ సభలో ఏడ్చుకొంటూ మాట్లాడటం, నిరసనలు అంటూ పిచ్చి చేష్టలతో నవ్వుల పాలు కావడం, చివరికి తండ్రి పేరిట నకిలీ లేఖ సృష్టించి సానుభూతి తెచ్చుకొనే ప్రయత్నం చేయడం వంటి చర్యలతో లోకేష్ తాను నాయకుడు కాను కాలేను అని రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సంకేతం ఇచ్చాడు.
అయితే 400రోజులు, 4వేల కిలోమీటర్లు రికార్డ్ స్థాయిలో పాదయాత్ర చేసి ముఖ్మమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర రికార్డులు బ్రేక్ చేస్తామంటూ అడుగు ముందుకు వేసి.. ఎండ కొడుతుందని సాయంత్రం నడవడం, మధ్యలో పండగలు, పబ్లిక్ హాలీడేస్, డాడీ జైలు కెళ్ళిన శుభవేళలు అంటూ అరకొరగా 223 రోజులతో పాదయాత్ర ను ముగిస్తున్నాడు. ఈ మాత్రం దానికి ఫ్లెక్సీలు, పూలు, పసుపు రంగు ప్యాకెట్లు బొక్క అని టీడీపీ అభిమానులు, జనసేన జెండా కూలీలు తిట్టుకుంటున్నారు.