కడలి ఒడిలో చేపల వేటనే జీవనంగా మార్చుకున్న గంగ పుత్రులకు ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకుంటే పొరపాటే .. ఎగిసిపడే అలలను అవలీలగా దాటి సముద్రాన్ని సునాయాసంగా ఈదే వీరు, ఎవరు మేలు చేస్తున్నారో ఎవరు ఓట్ల కోసం మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోలేరు అనుకుంటే పొరపాటే.
ప్రాంతీయ పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుసుకుంటే ఆయన రాజకీయ జీవితానికే మంచిది. టీడీపీ 5ఏళ్ళ పాలనలో గంగ పుత్రులకు జరగని మేలు జరిగినట్టుగా, ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా. నేడు జగన్ గారి ప్రభుత్వంలో జరుగుతున్న మేలు జరగనట్టుగా, నెరవేర్చిన హామీలు నెరవేర్చనట్టుగ, యువగళం పాదయాత్రలో ప్రచారం చేయడానికి నానా తంటాలు పడుతున్న లోకేష్ చివరికి ఆయన మాటలతో మత్స్యకారుల ముందు హాస్యాస్పదంగా మారిపోయారు.
2014 ఎన్నికల్లో టీడీపీ మత్య్సకారులకి ఇచ్చిన హామీలు చూస్తే , మత్స్యకారుల పిల్లల విద్య కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు చేస్తాం అన్నారు చేశారా అంటే చేయలేదు. జీవో 353 (మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా సంస్థాగత రుణాలందించి, చేప పిల్లలు, వలలు, సైకిళ్లు, పడవలు కొనుక్కునే వెసులుబాటు) పూర్తిస్థాయిలో అమలు చేస్తాం అన్నారు. చేపల వేటకు పడవలపై వెళ్ళే మత్స్యకారులకు 50% సబ్సిడీపై డీజిల్ సరఫరా చేస్తాం అన్నారు. పంచాయతీరాజ్ మరియు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను మత్స్యకార సొసైటీలకు అప్పగిస్తాం అన్నారు. సముద్ర తీరప్రాంత భూములు వారి అర్హతల మేరకు మత్స్యకారులకు కేటాయిస్తాం అన్నారు. వేటకు వెళ్ళే మత్స్యకారులు సముద్రంలో మునిగిపోయి శవం కనపడకపోతే మరణ ధృవీకరణ సర్టిఫికెట్‌ను ఇవ్వడానికి గతంలో నిర్ణయించిన 7 సంవత్సరాల సమయాన్ని 2 సంవత్సరాలకు తగ్గించి, ఎక్సగ్రేషియా చెల్లిస్తాం అన్నారు.
వీటిలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చిన దాఖలాలు లేవు . అలాగే గతంలో హుద్‌హుద్, తిత్లీ తుపానులకు దెబ్బతిన్న బోట్లకు ఏళ్ల తరబడి పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేశారే కానీ రూపాయి కూడా వారికి ఏ రూపానా సహాయం చేసింది లేదు. చంద్ర బాబు ప్రభుత్వం మత్స్యకార కుటుంభాలను పట్టించుకున్న పాపాన పోలేదు. దీనితో వారు జీవనం కోసం పక్క రాష్ట్రాలకు వలసల బాట పట్టారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించారు కాబట్టే టీడీపీ పార్టీకి కేవలం 23 స్థానాలకే ప్రజలు పరిమితం చేశారు.
ఇక ఈ నేపధ్యంలో జగన్ గారి ప్రభుత్వం రాగానే మత్య్సకార కుటుంభాలని గతంలో ఏ ప్రభుత్వం ఆదుకోని విధంగా వారికి అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార సోదరులు వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకూడదని 1,08,755 కుటుంబాలకు ఒకొక్కరికి 10వేలు చొప్పున ఆర్ధిక సహాయం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తొలి రెండేళ్లలో 2 వేలు చొప్పున ఇవ్వగా, ఆ తర్వాత 4వేల చొప్పున ఇచ్చారు. అదీ కూడా మర, యాంత్రిక పడవలకే పరిమితం చేశారు. ప్రస్తుతం డీజిల్ ఆయిల్ సబ్సిడి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 9 రూపాయులు ఇస్తున్నారు అంతే కాక మత్స్యకారులకు స్మార్ట్ కార్డులు ఇచ్చారు. వీటి ద్వారా సబ్సిడీ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డీజిల్‌కు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇలా ఏటా సగటున 20 వేల బోట్లకు రూ.25 కోట్లు చెల్లిస్తోంది.
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్య్సకార కుటుంభాలకు నష్టపరిహారంగా 10 లక్షలు అందిస్తుంది జగన్ గారి ప్రభుత్వం, అరేబియా సముద్ర తీరంలో వేటకు వెళ్ళి సరిహద్దు దాటి పాకిస్తాన్ కి పట్టుపడ్డ మన రాష్ట్రానికి చెందిన జాలర్లను పట్టుబట్టి విడిపించి తెచ్చారు.
మత్స్యకారుల వలసల నివారణ, వారికి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 3,767.48 కోట్లతో 10 షిప్పింగ్ హార్బర్లు , 4 ఫిష్ ల్యాండ్ కేంద్రాలు, 16వేల కోట్లతో నాలుగు పోర్టులను వేగంగా నిర్మిస్తుంది జగన్ గారి ప్రభుత్వం. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పించే విధంగా అడుగులు వేస్తుంది. దీంతో పాటు వీరి కుటుంభాలకు అమ్మవడితో పాటు ఇతర పధకాలతో వారికి అండగా నిలుస్తుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన 49 బోట్ల యజమానులకు ప్రభుత్వం వెంటనే 7 కోట్ల 11 లక్షల 76 వేల నష్ట పరిహారాన్ని విడుదల చేసి వారికి అండగా నిలబడింది జగన్ గారి ప్రభుత్వం. ఓఎన్జీసీ సంస్థ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు 108 కోట్లు కూడా సీఎం జగన్ జమచేస్తున్నారు.
ఇప్పటివరకు వీరికి 393.76 కోట్ల పరిహారం ఇచ్చారు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,43,649 మత్స్యకారులకు 3,835.89 కోట్లు జమచేశారు. రాష్ట్రంలో తొలి ఫిషరీస్ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం -2020, ఏపీ ఫిష్ ఫీడ్ చట్టం-2020, ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ చట్టం -2020 ఇలా ఎన్నో సంస్క్రణలకు ఈ ప్రభుత్వం భీజం వేసింది
ఈ విధంగా మత్స్యకారులకి అండగా ఉండడంతో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ని సైతం వెనక్కి నెట్టి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే తలసరి వినియోగం మాత్రం దేశంలోనే అట్టడుగున ఉండటం దురదృష్టకరం. చేపల వినియోగంతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నా, వినియోగంలో మాత్రం అట్టడుగున ఉండటానికి కారణం గత ప్రభుత్వాలు వాటి విక్రయాలకు సరైన మౌళిక వసతులు కల్పించకపోవడమే. దీంతో జగన్ గారి ప్రభుత్వం వాటిలో ఉన్న పోషక విలువలు ప్రజలకు తెలియచేస్తూ వాటి వినియోగం పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసి అందులో భాగంగా “ఫిష్ ఆంధ్ర” ఫిష్ మార్ట్ కానెస్ప్ట్ తీసుకుని వచ్చారు, రాష్ట్రవ్యాప్తంగా 26 ఆక్వా హబ్‌లు.. వాటికి అనుసంధానంగా 4,000 రిటైల్ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో 2,184 రిటైల్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక.. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా అభివృద్ధి చేసిన వెబ్ అప్లికేషన్ ఈ–మత్స్యకార్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 155251ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇలా మత్స్యకారులకి, ఆక్వా రంగానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎంతో అండగా ఉంది జగన్ గారి ప్రభుత్వం. గంగ పుత్రులకి జగన్ గారు చేస్తున్న మేలు మద్యలో దళారీ వ్యవస్థ లేకుండా వారికి నేరుగా అందుతుంది. ఈ నేపద్యంలో నారాలోకేష్ ఓట్లకోసం మాట్లాడే మాటలు వింటూ గంగ పుత్రులే అందుతున్న వాటిని అందడంలేదని చెప్పటం సరైన పద్దతి కాదని, ఇప్పటి ప్రభుత్వం కన్నా ఇంకా ఎక్కువగా మాకు ఏం మేలు చేస్తాడో చెబుతాడని ఆశపడితే అన్ని అసత్యాలు పలుకుతూ వెళ్ళిపోయాడని పెదవి విరిచారు.