2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయబోయే స్టార్ క్యాంపెనర్లు లిస్టుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకేంద్ర కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 37 మందితో కూడిన జాబితాని విడుదల చేసింది. 37 మందిలో 25 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోని వివిధ పదవులు పొందిన వారు కాక మిగిలిన 12 మంది సాధారణ కార్యకర్తలను తమ పార్టీ స్టార్ క్యాంపెనర్లుగా నియమించుకుంది. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో తరచూ ప్రజలను ఉద్దేశిస్తూ చెప్తూ మీరే నా స్టార్ క్యాంపైనర్లు అన్న మాటను నిజం చేశారు.
స్టార్ క్యాంపెనర్ల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మహ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్, కే భాగ్యలక్ష్మి, గొల్ల బాబూరావు, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మల్లాది విష్ణు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, వీ ఖాదర్ బాష, కుంభా రవిబాబు, ఆర్ కృష్ణయ్య, పోసాని కృష్ణమురళి, వాసిరెడ్డి పద్మ, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వీ విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మద్దాలి గిరి, రావెల కిశోర్ బాబు, జకియా ఖానమ్, ఎస్ ఎం జైనుద్దీన్, శిద్ధా రాఘవరావులు ఉన్నారు. పైన ప్రకటించిన అందరూ పార్టీ పదవుల్లో ఉన్నవారు. మిగిలిన క్రింద ప్రకటించిన 12 మందిని ప్రజల నుంచి తమ స్టార్ క్యాంపెనర్లు గా ఎంచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
స్టార్ క్యాంపైనర్లుగా సాధారణ ప్రజలు ఎంచుకున్న వారిలో గంగు కల్యాణి, షేక్ సందని, ఓరేకంటి జనార్థన్ రెడ్డి, దాజప్పగారి జనపా రూపాణి, చెల్లె పరంజ్యోతి, పందలనేని శివప్రసాద్, కట్టా జగదీష్, కృష్ణం రామకృష్ణ, గొల్లపల్లి శ్రీను, సయ్యద్ అన్వర్, అనూషభట్టు అనంత లక్ష్మి, చల్లా ఈశ్వరి ఈ జాబితాలో ఉన్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసేంత వరకూ వారంతా పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.