2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేందుకు అవసరమైన కీలక అడుగులు వేస్తున్న వైఎస్సార్సీపీ పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జిలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
కాగా ఈ జాబితాలో పలువురు మంత్రులకు కూడా స్దాన చలనం కలగడం గమనించాల్సిన విషయం.