ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’కు అటు వైఎస్సార్సీపీ శ్రేణులు, ఇటు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీనికి కారణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు. శనివారం దెందులూరు సభకు భారీగా నాయకులు, అభిమానులు తదితరులు తరలివెళ్లారు. పెనమలూరు, ఉయ్యూరు, దెందులూరు, పెడన నుంచి ప్రత్యేక వాహనాల్లో వెళ్లి జగన్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజానగరం నుంచి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా వెళ్లారు. విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివారావు కార్యకర్తలతో కలిసి సభకు వెళ్లారు. గుడివాడ వీకేఆర్ వీఎన్బీ కళాశాల వద్ద శ్రేణుల ర్యాలీని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తిరువూరు నుంచి ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ నేతృత్వంలో శ్రేణులు భారీగా వెళ్లాయి. కైకలూరు నుంచి తరలిన బస్సులను ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పర్యవేక్షణలో అమలాపురం నుంచి వంద బస్సుల్లో సిద్ధం సభకు వెళ్లారు. సభలకు పోటెత్తుతుండటంతో పార్టీ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది.