వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు.
కాగా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను నేటినుండి ఈనెల 15 వరకూ స్వీకరించనున్నారు. ఈనెల 27 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకున్న సంఖ్యా బలంతో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలను మూడింటిని గెలుచుకోనుంది..