గుంటూరు జిల్లా నల్లపాడులో “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వద్దకు కొందరు ఆపన్నులు సహాయం కోసం వచ్చారు. వివరాల్లోకి వెళితే… అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురు వైద్యం మరియు మందుల ఖర్చు కోసం ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలు విని చలించిపోయిన ముఖ్యమంత్రి సత్వరమే వారికి కావలసిన సహాయం అందేలా చేయమని జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు ఇచ్చారు.
గుంటూరు కి చెందిన ఎనిమిదేళ్ళ బాలుడు బి. నాగ త్రినాధ్ రెడ్డి హైపోగ్లైసేమియాతో బాధ పడుతున్నందున.. స్పీచ్ థెరపీ కోసం ఇరవై లక్షల సహాయాన్ని, ప్రతి నెలా వైద్య ఖర్చుల నిమిత్తం నెలకి ఇరవై వేల మొత్తాన్ని, పల్నాడు జిల్లాకు చెందిన మోక్షిత్ కి పన్నెండు లక్షల సహాయం, చిలకలూరిపేట చెందిన సయ్యద్‌కు క్యాన్సర్ చికిత్స నిమిత్తం సుమారు నలభై అయిదు లక్షల సహాయాన్ని సీయం ఉదార స్వభావంతో, మానవతా దృక్పథంతో అందించనున్నారు. బాధితులు జగన్మోహన్రెడ్డి గారి సత్వర సాయానికి, పెద్ద మనసుకి అభినందనలు తెలియజేసారు.