ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చదువుల విప్లవం మొదలైంది.. పేద మధ్యతరగతి తల్లుల బ్రతుకుల్లో పిల్లలను చదివించగలమన్న ధీమా వచ్చింది.. కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో మారిన ప్రభుత్వ పాఠశాలలు విద్యా బోధన స్థాయి పెరిగేలా చేశాయి. ఇంగ్లీష్ మీడియం విద్యతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదిగేందుకు దోహదపడింది.. విద్యా కానుకతో బడికెళ్ళాలన్న ఆసక్తి కలిగేలా, జగనన్న గోరుముద్దతో విద్యార్ధులలో పౌష్టికాహారం లోపం తగ్గేలా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ బడి చదువులను పండగలా మార్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడంతో పాటు.. 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ను.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం అమలుచేసే దిశగా అడుగులు వేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 56 నెలల కాలంలో జగనన్న విద్యాకానుకలో 47లక్ష మంది విద్యార్థులకు 3367 కోట్లతో విద్యాకానుక కిట్లను అందజేసింది. నాడు నేడు పథకంలో భాగంగా రెండు దశల్లో 99.81 శాతం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. జగనన్న గోరుముద్ద పథకం కోసం కోసం రూ.1910 కోట్లు ఖర్చు చేసింది.. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్ల ఎక్కువ..ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు 34 లక్షల మంది విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్ అందించింది.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన విధానాలతో.. కళాశాల విద్యను ప్రోత్సహిస్తూ.. ఈ 56 నెలల కాలంలో 11,901 కోట్లతో జగనన్న విద్యాదీవెన, 4,267కోట్లతో జగనన్న వసతీ దీవెన పథకాలను ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేస్తుంది. జగనన్న
విదేశీ విద్యాదీవెన పథకం కింద 1858 మంది లబ్ధి పొందారు. ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం అందిస్తుంది ప్రభుత్వం. విద్యార్ధులు చదువులు ముగించుకోని మెరుగైన ఉద్యోగాలు సాధించే వరకూ విద్యార్ధులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చిన ఈ విద్యా విప్లవంతో విద్యార్ధులలో డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతానికి తగ్గింది. 75ఏళ్ళ స్వతంత్ర భారతంలో కేవలంలో 5 ఏళ్ళలో విద్యావ్యవస్థ లో ఇన్ని సంస్కరణలు తెచ్చిన ప్రభుత్వం మరోకటిలేదు..