పిఠాపురంలో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అక్కడ కూటమి తరుపున పవన్ కళ్యాణ్ పోటీలో వుండడంతో పోటీ రసవత్తరంగా వుండబోతుంది. పిఠాపురంలో బలమైన అభ్యర్ధిగా వైసీపీ నుండి వంగా గీతని బరిలోకి దింపింది వైసీపీ. అలాగే నియోజకవర్గ భాద్యతలను ముగ్గురు కీలక నేతలు అయిన ప్రస్తుత ఎంఎల్ఏ పెండెం దొరబాబు, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, దాడిసెట్టి రాజాకు అప్పగించింది. గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయిన మిథున్ రెడ్డి పిఠాపురం మీద ఈరోజు స్పెషల్ ఫోకస్ పెట్టీ రివ్యూ మీటింగ్ పెట్టారు. దీనిలో పాల్గొన్న వంగా గీత, పెండెం దొరబాబు, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంలతో మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీకి గ్రాఫ్ చాలా పెరిగింది, ఇంకా కష్టపడాలి, ముగ్గురు నాయకులు కలిసి కట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలుపు సాధించాలని సూచించారు.
మరోవైపు కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ మొదటి విడతలో ఐదు రోజులుమాత్రమే ప్రచారం చేశి జ్వరం అంటూ సినిమా షూటింగులకు వెళ్లిపోయారు . అలాగే జనసేన తరుపున పిఠాపురం కు 202 మందితో ప్రచార కమిటీలు , ఎన్నికల కమిటీలు వేసి భాద్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్. వీరంతా ఆయా గ్రామాల్లో, మండలల్లో జన సేన ఎన్నికల, ప్రచార భాద్యతలు నిర్వహించనున్నారని చెబుతున్నారు కానీ పవన్ గెలుపు భాద్యత మొత్తం వర్మ మీదే మోపినట్టు కనపడుతుంది . అయితే టీడీపీ, జన సేన కార్యకర్తల మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరలేదు. పవన్ తరుపున ప్రచారానికి వెళ్లిన వర్మను టీడీపీ నాయకులు కార్యకర్తలు జన సేనకు ఎందుకు అమ్ముడుపోయారు అని తిడుతున్నారు. ఇది చివరకు ఎక్కడికి దారి తీసిద్దో చూడాలి. పవన్ కళ్యాణ్ రెండు రోజులు ప్రచారం రెండు రోజులు అనారోగ్యం పేరుతో హైదరబాద్ కు పరిమితమవ్వడం కూటమి గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తోంది.
మరోవైపు వైసీపీ ఎన్నికల ప్రచారంలో దుసుకువెళ్తుంది. మొన్నటి వరకు ఎంఎల్ఏ పెండెం దొరబాబుతో వంగా గీత సఖ్యత లేక దొరబాబు ఎన్నికల ప్రచారం కు దురంగా వున్నారు. ఇప్పుడు పార్టీ పెద్దలు ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదర్చడంతో వంగా గీత, పెండెం దొరబాబు ఇద్దరు కలిసి పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతుండడంతో వైసీపీ లో జోష్ పెరిగింది. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోవైపు తనదైన స్టైల్ లో ప్రచారం చేస్తూ చాప కింద నీరులా ప్రభావితం చేస్తున్నరు. ఇదే ఊపు ఎలక్షన్ వరకు కొనసాగిస్తే వంగా గీత గెలుపు సులువని పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.
పరిస్థితులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ కు మరోసారి కష్టకాలం తప్పక పోవచ్చు.