జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సమ ప్రాధాన్యత ఇవ్వకపోతే దేశం , సమాజం పురోగతి సాదించందనే దృడాభిప్రాయం ఉన్న వ్యక్తి సీఎం జగన్. ఈ విషయం మాటలతో కాకుండా అన్ని రంగాల్లో మహిళకు పెద్దపీటవేస్తూ చేతలతో చేసి చూపించి దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త పాలనా వ్యవస్థకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. దేశ చరిత్రలో ఒక్క మహిళామణులకే వారికి ఆర్ధిక సామాజిక బరోసా కల్పిస్తూ ఒక ప్రభుత్వం ఇన్ని స్వావలంభన సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సీఎం జగన్ గారి పరిపాలనా కాలంలో జరిగింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మహిళల భద్రత కోసం రెస్పాన్స్ టైము మరింతగా తగ్గించి ఇంకా మెరుగుపరచేందుకు దిశ వాహనాలను లాంచ్ చేశారు. దిశ ఫోన్ ను ఎవరైనా 5 సార్లు షేక్ చేస్తే, షేక్ చేసిన పది నిమిషాల్లోనే కచ్చితంగా పోలీసులు అందుబాటులోకి వచ్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసారు, ఇందులో భాగంగానే దిశ బైక్ లను ప్రతి పోలీస్ స్టేషన్కు అందించారు. వీటితోబాటు వివిధ పోలీస్ స్టేషన్లలో వాహనాలకు జిపిఎస్ అమర్చి వాటన్నింటినీ దిశ యాపుకు అనుసంధానం చేశారు. ఆ వెహికిల్స్ పూర్తిగా ఏ అక్క, చెల్లెమ్మకైనా ఇబ్బందికర పరిస్థితి ఉండి ఐదుసార్లు తమ ఫోన్ షేక్ చేసినా చాలు, పది నిమిషాల్లోనే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ అక్క చెల్లెమ్మకు తోడుగా నిలవాలనే ఒక గొప్ప ఆశయంతో ప్రారంభించి సత్ఫలితాలు అందుకున్నారు. “దిశ” అనే పేరు చెబితే ఈ రోజు రాష్ట్రంలో “రక్షణ” అనేది ప్రతి అక్క చెల్లెమ్మకు గుర్తుకు వస్తుంది.
అమ్మఒడి పధకం ద్వారా రాష్ట్రంలో 43 లక్షల మహిళ ఖాతాల్లోకి డబ్బులు వేసి వారి పిల్లల విధ్య వారికి భారం కాకుండా ఒక సరికొత్త చదువుల విప్లవానికి నాంది పలికారు. వైయస్సార్ ఆసరా ద్వారా గత పాలకుల నిర్లక్ష్యం వలన నిర్వీర్యం అయిన పొదుపు సంఘాలను ఆదుకుని వారికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారానే 58 నెలల వ్యవధిలో 33,14,916 మంది అక్కచెల్లెమ్మలకు 19,189 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి పంపించి తోడుగా నిలబడ్డారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందించి మహిళా పక్షపాతిగా కీర్తి గడించారు. జగన్ అన్న విద్యా దీవెన , వసతి దీవెన అంటూ ఏ పధకమైన ఎక్కడా లంచాలకి , వివక్షకి తావులేకుండా మహిళల చేతికే నేరుగా డబ్బుని అందిస్తూ పరిపాలన సాగడం ఒక రికార్డ్ గా చెప్పవచ్చు.
వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ కాంట్రాక్టుల్లో 50% మహిళలకే కేటాయిస్తూ చట్టం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది జగన్ ప్రభుత్వం. నామినేటెడ్ పదవుల్లో 51% మహిళలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం జగన్ గారిదే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్ ఛైర్మన్గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్గాను నీలం సాహ్ని నియమితులయ్యారు. గతంలో మహిళకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చి వైఎస్సార్ రికార్డు సృష్టిస్తే సీఎం వైఎస్ జగన్ హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మహిళామణికి అవకాశమిచ్చి చిత్తశుద్ధి చాటుకున్నారు.
తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి, మలి విడతలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులు అప్పగించారు. రాష్ట్రంలో 13 జడ్పీ ఛైర్మన్ల పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారు. 26 జడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మహిళలకే దక్కాయి. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులకుగానూ 18 మంది మహిళలే ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకే అగ్రపీఠం దక్కింది. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53% దాదాపు 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో 51% మహిళలకే ఇవ్వడం విశేషం.
చంద్రబాబు పాలనలో డ్వాక్రా రుణమాఫీ అంటూ , ప్రతి ఇంటికి 12 గ్యాస్ సిలిండర్లు అంటూ, ఆడబిడ్డ పుట్టగానే 25వేలు డిపాజిట్ చేస్తాం అంటూ, మహిళల కాపురాల్లో చిచ్చు పెడుతున్న బెల్టు షాపులు రద్దు చేస్తాం అంటూ, పండింటి బిడ్డ పేరున పేద గర్భిణీ స్త్రీలకు 10వేలు అంటూ, బడికి వెళ్ళే ఆడపిల్లలకు సైకిళ్ళు అంటూ, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ఉచితం అంటూ మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కుటీర లక్ష్మీ అంటూ నోటికి వచ్చిన వాగ్ధానాలు చేసి గెలిచిన తరువాత కనీసం ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు గత చంద్రబాబు ప్రభుత్వం. ఈ మోసం సరిపోదు అనట్టు తెలుగుదేశం నేతలే కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపి ఆడవారి మాన ప్రాణాలతో చెలగాటం ఆడుకుని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశారు. మహిళలను ఓటర్లుగా మాత్రమే చూసే చంద్రబాబు పాలనకి, మహిళలే సమాజ పురోగతికి మార్గం అని నమ్మిన జగన్ పాలనకి ఉన్న తేడా రాజకీయ వ్యవస్థలోనే ఒక కేస్ స్డడీగా చెప్పవచ్చు.