పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఎమ్మెల్యే అవుతాడా. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో పోటి చేసిన భీమవరం, గాజువాకలో పోటి చేస్తా అంటూ కాలయాపన చేసి అక్కడ జరిగిన సర్వేలో మళ్లీ ఓడిపోతాను అని తెలియడంతో కొత్త నియోజకవర్గం వేట లో పడ్డారు. మొదట కాకినాడ సీటి నుండి పోటీ చేద్దాం అని రెండు రోజులు కాకినాడలో మకాం వేసి తన కుల పెద్దలను, కొంత మంది కార్యకర్తలను పిలిపించుకొని హడావిడి చేశారు చివరకి కాపు కుల పెద్దలు, కార్యకర్తలు ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోతారు అని చెప్పగానే అక్కడినుండి మూడో రోజే బిచాణా ఎత్తి వేసి తిరిగి మంగళగిరి వచ్చారు.
ఎలక్షన్ దగ్గరపడుతుండటంతో అటు టీడీపీ, బిజెపి తో పొత్తు ఖాయం అయ్యిన తరువాత పవన్ కళ్యాణ్ తిరిగి మళ్లీ భీమవరం లో పోటి చేద్దాం అని చూస్తే లోకల్ టీడీపీ నాయకులు మేము సపోర్ట్ చెయ్యము అని ఖరాఖండిగా చెప్పడంతో మళ్ళీ తను పోటి చేసే స్ధానం పై మొదటికి వచ్చింది.
చివరకు తన కాపు కులం ఓట్లు అధికంగా 93000 ఓట్లు ఉన్న పిఠాపురం నుండి పోటీ చేస్తా అని ప్రకటించాడు. అలా ప్రకటించాడో లేదో తెలుగు మహిళాలు పవన్ కళ్యాణ్ ను తిడుతూ శాపనార్థాలు పెడుతూ నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున గొడవలు చేశారు. ఇక టీడీపీ నాయకుడు వర్మ ఎవరు వచ్చిన నేను పోటి చేసి తీరుతా అని ప్రకించారు.
దీంతో పవన్ కళ్యాణ్ తన బాధను చంద్రబాబు కు వెళ్ళడించగా , చంద్ర బాబు పిఠాపురం టీడీపీ నాయకుడు వర్మ ను పిలిపించుకొని పవన్ కి సపోర్టు చెయ్యమని ఆదేశించారు.
దానికి వర్మ ఒప్పుకొని కొన్ని కండిషన్ లు పెట్టారు, తన చేతుల మీదగా మాత్రమే ఎలక్షన్ జరగాలి, నేను చెప్పినట్టే జరగాలి, పవన్ కళ్యాణ్ గెలిచినా పెత్తనం అంతా నాదే వుండాలి అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుక మాదిరి అయ్యింది.
ఇదంతా ఎందుకు అని పవన్ కళ్యాణ్ ఎంపీ గా కూడా పోటి చేస్తా అమిత్ షా ఆదేశిస్తే అని సన్నాయి నొక్కులు నొక్కారు
అ మాట చెప్పగానే టీడీపీ నాయకుడు వర్మ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ గా పోటీ చేస్తే నేనే పిఠాపురం ఎమ్మెల్యే గా పోటి చేస్తా ఎవడికీ అవకాశం ఇవ్వను అంటూ అటు చంద్ర బాబు నాయుడుకు ఇటు పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పడు పవన్ కళ్యాణ్ కు భయం మొదలయింది ఈసారి అయిన టీడీపీ పొత్తుతో కనీసం ఎమ్మెల్యే అవుదాం అనుకుంటుంటే అయ్యే పరిస్థితి కనపడటం లేదు అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలవడం అటుంచి పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తారా లేక కాకినాడలో ఎంపి అభ్యర్థిగా పోటి చేస్తారా అనేది ఆసక్తికరం .