వెంకయ్యనాయుడి ఉపరాష్ట్రపతి పదవి కాలం అయిపోగానే, వెంటనే వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన్ని రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించాలని ప్రతీ రోజూ డిబేట్ లు పెట్టిన ఎల్లో మీడియా, బీజేపీ ఎవరిని రాష్ట్రపతి చేయాలో కూడా వారే నిర్ణయించేవారు.. ఒకవేళ బీజేపీ వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి గా చేయకపోతే దక్షిణ భారత దేశం భారత్ నుండి విడిపోయి కొత్త దేశం గా అవతరించాలి అని. ఉత్తర భారత దేశం దక్షిణ భారతం పై ఎలా అధిపత్యం చూపుతుందో నిత్యం ఎత్తి చూపిన ఎల్లో మీడియా నానా యాగీ చేసింది. అసలు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవ్వడానికి మొత్తం దక్షిణ భారతదేశానికి సంబంధం ఏమిటో వారికే తెలియాలి. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి దశాబ్దాల దాటినా, సొంతగా ఒక నియోజకవర్గం లో ప్రభావితం చూపకపోయినా, టీడీపీ ప్రయోజనార్ధం రాష్ట్రం లో బీజేపీ ఎదుగుదలను దగ్గరుండి అడ్డుకున్నా, వెంకయ్యనాయుడు కు బీజేపీ అయన తాహతుకు మించిన పదవులే ఇచ్చింది, రాష్ట్ర బీజేపి అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, పలుమార్లు ఇతర రాష్ట్రాల నుండి రాజ్యసభ సభ్యుడిగా, రెండు సార్లు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆఖరికి ఉపరాష్ట్రపతి ని కూడా చేసినా ఎల్లో మీడియా వారి దాహర్తి తీరలేదు. రాష్ట్రపతిని చెయ్యాల్సిందేనని పట్టుబట్టాయి…
మరి అదే స్థాయిలో కాకున్నా తనకు చేతనైనంత సాయం టీడీపీ కి చేసిన రఘురామ కృష్ణం రాజుకి బీజేపీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఎలాంటి డిబేట్ లు లేవు, ఇప్పుడు దేశం రెండు ముక్కలయ్యే అవకాశం లేదా? కేవలం కంటితుడుపు చర్యలేనా? కనీసం తాము చెప్పినట్టు ఆడే బాబు ని అయినా ఒప్పించి రఘురామ కృష్ణం రాజుకు టికెట్ ఇప్పించొచ్చుగా? ఓహో వెంకయ్యనాయుడు మనోడు కానీ, రఘురామ కృష్ణం రాజు మనోడు కాదుగా. అంతేలే మనోడికి ఒక రూలు, మందోడికి ఇంకో రూలు… అదే ఎల్లో ప్రపంచం…