రాష్ట్ర ప్రయోజనాల కంటే చంద్రబాబు ఉనికి తెలుగుదేశం పార్టీ మనుగడే ముఖ్యం అనుకుంటున్నాయి ఎల్లో మీడియా, పచ్చ పత్రికలు. ప్రజా ప్రయోజనార్థం జరిగే ఏ అంశంలోనూ ఈ ఎల్లో మీడియా ఇంత ఉత్సాహం చూపించదు కానీ టిడిపిని, చంద్రబాబును వెనకేసుకు రావడానికి మాత్రం ఎప్పుడూ వెంపర్లాడుతుంది. ఒక రకంగా ఎల్లో మీడియా లేకపోతే బాబు ఎంత అజ్ఞాని అనేది ప్రపంచానికి ఎప్పుడో తెలిసేది. కానీ, కేవలం ఎల్లో మీడియా ఎలివేషన్స్ వల్లనే బాబు ప్రపంచానికి ఒక రాజకీయ కోవిదుడిలాగా కనబడతాడు కానీ ఎల్లో మీడియా లేకపోతే బాబు భవిత శూన్యం.
ప్రతి సభలో మీటింగ్ లలో ప్రజల కోసం రాష్ట్రం కోసం అని డబ్బా కబుర్లు చెప్పే బాబు ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనార్థాల కోసం పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే.. వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.. ఏ రోజు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు పాటుపడిన సందర్భాలు అస్సలు కనిపించవు. నిజంగా చంద్రబాబుకి రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద ప్రేమ బాధ్యత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదును వదిలి వచ్చేవాడు కాదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి ఉండేవాడు కానీ హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని ఓటుకునేటి కేసులో నుండి తనను తాను రక్షించుకోవడం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టేవాడు కాదు.
ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తన వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని సర్వ నాశనం చేసిన సందర్భాలు కోకొల్లలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికే వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించొద్దు అంటూ విజయసాయిరెడ్డి నాయకత్వాన TRS తో సహా వివిధ పార్టీలకు చెందిన 120 మంది ఎంపీల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రధాని కార్యాలయం లో అందచేశారు. కానీ.. నిజంగా తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర భవిష్యత్తు మీద బాధ్యత ఉంటే ఇదే అంశం మీద టీడీపీ ఎంపీలు సంతకాలు ఎందుకు పెట్టలేదు? పొద్దున లేస్తే…ఒక్క అమరావతికోసం మాత్రమే అనునిత్యం గొంతు ఎత్తి రంకెలు వేసే ఈ టీడీపీకి విశాఖ ఉక్కుపై ఉన్న ప్రేమ ఇదేనా? కేవలం తన స్వార్ధ రాజకీయాల కోసం విశాఖ ఉక్కు పై అడుగు ముందుకే లేని చంద్రబాబు చేతకానితనాన్ని ప్రచురించే ధైర్యం చేయగలదా? ఇదే విషయం మీద ఎల్లో మీడియా చర్చలు పెట్టగలరా అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట…