మన సామాజిక వర్గం వ్యక్తి మాత్రమే అధికారంలో ఉండాలి. అందులోనూ చంద్రబాబు నాయుడే అయ్యుండాలి. ఇంకెవరున్నా సంహించను. ఇది రామోజీరావు ఈనాడు ధోరణి. వీళ్లు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తారనే అందరికీ తెలిసిందే. కానీ రాసే రాతల్లో ఒక్క శాతమైనా నిజం ఉండాలి కదా. ముఖ్యంగా పనికొచ్చే విషయమై ఉండాలి. అలాగే ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరుగుతోందంటే ప్రశ్నించడంలోనూ అర్థం ఉంది. కానీ నిలువెల్లా విషయం నింపుకొంది ఈనాడు. చాలా దారుణంగా జిల్లాల్లో పనికిరాని వార్తలను ప్రచురిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద వేయడమే పనిగా పెట్టుకుని ప్రతి చిన్న విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌కు ముడి పెట్టి రాస్తోంది.
ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చాలా సర్వసాధారణం. దీనికి టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన, సీసీఎం, సీపీఐ ఎవరూ అతీతం కాదు. కానీ జగన్ బొమ్మ ఉండే ఫ్లెక్సీలు ఈనాడుకి ఎప్పుడూ ఇబ్బందిగా కనిపిస్తాయి. మంగళవారం నెల్లూరు ఎడిషన్‌లో దేనికి ‘సిద్ధం’.. పొగతో జర భద్రం అంటూ వార్తను ప్రచురించింది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా తరచూ చెత్తకు నిప్పు పెడుతున్నారట. వచ్చే పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. ఇంత వరకు బాగానే ఉంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం దిన పత్రికగా దాని బాధ్యతనుకోవచ్చు. కానీ అంతటితో ఆగితే అది రామోజీరావు పత్రిక ఎందుకవుతుంది. ఆ బస్టాండ్ ప్రాంగణంలో జగన్ సిద్ధం పోస్టర్లున్నాయి. దీంతో పొగతో ఇబ్బందులు పడటానికి మీరు సిద్ధమా అని సీఎం అడుగుతున్నట్లు ఉందని ప్రయాణికులు అనుకున్నారంట. ఇది ఈనాడు కంటికి కనిపించిందంట. చదివిన ఎవరికైనా ఇది వార్తేనా అనిపించక మానదు.
ఒప్పుకుంటాం బ్రో.. మీ నాయకుడు చంద్రబాబే. ఆయన్నే మీరు గెలిపించాలి. అందుకోసం ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసుంటే ఆధారాలతో సహా రాయండి. అంతే కానీ దిగజారి రాస్తే ఎలా.. చాలామంది మార్కెట్లో ఈనాడు కావాలని అడగడం మానేశారట. ‘ఈనాయుడు’ ఇవ్వండి అంటున్నారట. పత్రికకు ఈ పేరే పెట్టుకుంటే కరెక్ట్‌గా ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారంటగా..