2024 ఎన్నికలు పురస్కరించుకుని చంద్రబాబు తన మార్కు రాజకీయానికి తెరలేపారు. ఏకంగా ఎన్నికల కమీషన్ స్టడీ అంటూ రాష్ట్రంలో వైసీపీ దొంగ ఓట్ల దందా చేస్తుందంటూ ఆరోపించారు. చంద్రగిరి నియోజక వర్గంలోని ఓటరు జాబితాల్లో అవకతవకలున్నాయని, ప్రభుత్వం ఈ చర్యలని ప్రోత్సహిస్తున్నట్టున్నదని తెలిపారు.
అయితే, ప్రతీ అయిదేళ్ళకి ఏం జరిగిందో మర్చిపోయే ఈ ఎన్నికల గజినీ… 2019 కి ముందు ఆంధ్ర ఓటర్ల లిస్టును, ఆధార్ కార్డు డేటాను హైదరాబాద్కు చెందిన కంపెనీలకు అమ్మి సొమ్ము చేసుకున్న విషయం మనందరికీ గుర్తున్నా, పాపం చంద్రబాబు మాత్రం మరిచినోయారు. అప్పట్లో గంటలకి గంటలు టీవీ డిబేట్లు, న్యూస్ హెడింగులతో “డేటా థెఫ్ట్” అనే స్కామ్ ఎంత గుబులు పుట్టించారో మరిచిపోయి ఇపుడు కల్లబొల్లి మాటలు చెపుతున్నారు.
ఇదిలా ఉంటే, విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీకి చెందిన ఓ కమిటీ ఎన్నికల కమీషన్ ముందుకు దృష్టికి ఒక కొత్త సమస్యను తీసుకొచ్చారు. తెలంగాణ లో ఎన్నికలు ముగిసిపోయింది కనుక, అక్కడ ఉన్న ఆంధ్రా వాళ్ళను, బాబ భజన చేసే ఐ.టీ వాళ్ళను కొత్తగా ఆంధ్రాలో మళ్ళీ ఓటుకై అప్లై చేయిస్తున్నారని, అపుడు వీరందరికీ రెండు చోట్ల ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పారు.
ఇప్పటికే నాగబాబు రెండు చోట్లా ఓటు హక్కుకోసం ప్రయత్నించి అభాసుపాలైన సంగతి తెలిసిందే. చంద్రబాబు వార్స్ చూస్తుంటే దొంగే “దొంగా దొంగా” అని అరిచి రచ్చకెక్కినట్టు ఉంది.