ఈవీఎంల పనితీరు వివరించేందుకు మాక్‌పోలింగ్ నిర్వహించిన అధికారులే ఆశ్చర్యపోయిన ఘటన పుంగనూరులో చోటు చేసుకుంది. ప్రజలకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించేందుకు పుంగనూరు మండల కార్యాలయంలో ఆర్వో మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ సుబ్రమణ్యంరెడ్డిల ఆధ్వర్యంలో మాక్‌పోలింగ్ నిర్వహించారు. ఈవీఎంలలో ప్రజలకు ఓటు ఎలా వేయాలో వివరించే క్రమంలో గౌరమ్మ అనే మహిళ స్పందించిన తీరు ఆ అధికారులను అవాక్కయ్యేలా చేసింది.
ఓటు వేయడం అంటే మనకు నచ్చిన పార్టీలలో ఆయా పార్టీలకి కేటాయించిన గుర్తుపై బటన్ నొక్కితే సరిపోతుందని అక్కడ ఏర్పాటు చేసిన డమ్మీ గుర్తులను చూపిస్తుంటే ఆ గుర్తులను పరిశీలించిన గౌరమ్మ ఇక్కడ జగన్ గుర్తు లేదు, కాబట్టి నేను ఓటు వేయను బటన్ నొక్కనని తేల్చి చెప్పింది. దాంతో అనుకోని ఈ సంఘటనకు ఆర్వో మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ సుబ్రమణ్యంరెడ్డిని అవాక్కయ్యారు. ఇది ప్రజలకు ఓటు వేయడాన్ని గూర్చి అవగాహన ఏర్పరిచే కార్యక్రమం అని ఎన్నికలు త్వరలో జరుగుతాయని గౌరమ్మకి వివరించి ఓటు ఎలా వేయాలో చూపించారు. పేద ప్రజల మనసులో సీఎం జగన్ గూడు కట్టుకుని ఉన్నాడనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎం జగన్ అధికారంలోకి రాగానే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా చెరిపేసారు. పెన్షన్లను వలంటీర్ల ద్వారా ఇంటివద్దకే చేరుస్తుండగా సంక్షేమ పథకాలను ఫలాలను మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. పాలనలో జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో నిరుపేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ది చేకూరినవారంతా జగన్ వైపే నిలబడతారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.