జనసేన, టీడీపీల పొత్తు టీడీపీ సీనియర్లలో కాక రేపుతుంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్న పలు నియోజక వర్గాలు తమకి కావాలని జనసేన కోరడం ఆయా సీట్లలో దశాబ్దాలుగా పాతుకొని పోయి ఉన్న, గత నాలుగేళ్లుగా క్షేత్ర స్థాయిలో కష్ట పడుతున్న టీడీపీ నాయకులకు ముచ్చమటలు పట్టిస్తుంది.
పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేదాని కన్నా ఎక్కడ కేటాయిస్తారు అనే దాని పై టీడీపీ నేతలు కొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అని చెప్పొచ్చు. ఈ క్రమంలో తమ స్థానానికి ఎసరు వస్తుందని అంతర్గతంగా తెలుసుకొన్న టీడీపీ నేతలు కొందరు అధిష్టానంతో తేల్చుకోవటం కోసం, ప్రత్యామ్నయ మార్గాల కోసం ముందే సిద్దపడి తమ వర్గాన్ని సమాయాత్తం చేసుకోవటం మొదలు పెట్టారు.
ఈ కోవలో ముందు బయట పడ్డ నాయకుడు ఆలపాటి రాజా,
తెనాలి నియోజకవర్గం నుండీ టీడీపీ తరుపున సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహిస్తూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా పార్టీ విధేయుడిగా పేరు పడ్డ ఆలపాటి, ఇటీవల కొద్ది కాలం క్రితం ఓ విలేకరుల సమావేశంలో పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు ఇవ్వాలని నిర్ణయిస్తే తాను అభ్యంతరం చెప్పబోనని వ్యాఖ్యానించారు. కానీ కనీసం స్థానిక బలాబలాలు దృష్టిలోకి తీసుకోకుండా, తన అభిప్రాయం తెలుసుకోకుండా జనసేన కోరినంతనే తన సీటు ఇవ్వటానికి నిర్ణయించారని తెలుసుకొన్న ఆలపాటి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని సమాచారం .
దరిమిలా తన అనుచరులకు ఫోన్ చేసిన ఆలపాటి భవిష్యత్తు నిర్ణయం తీసుకోవడం కోసం సమావేశమవుడామని ముఖ్యు అనుచరులందరిని బుధవారం రావాల్సిందిగా గుంటూరులోని తన ఇంటికి ఆహ్వాణించిన మీదట ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి చేరుకొంటున్న అభిమానుల్ని కొందరు విలేఖరులు కదిలించగా ఆలపాటికి అన్యాయం జరిగితే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామనే సమాధానం రావడం గమనార్హం
ఇలాగే పరస్పర వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న పలు స్థానాలు చూస్తే టీడీపీ, జనసేన ఉమ్మడి లిస్టు బయట పడిన వెంటనే వెలువడే రాజీనామా ప్రకటనలతో చంద్రబాబుకి తీవ్ర తలపోటు తప్పదేమో