ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ నాయకులు పోతున్న వింత వింత పోకడలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరిలోని రామచంద్రపురం నియోజకవర్గాన్ని వాసంశెట్టి సుభాష్ కు టికెట్ కేటాయించారు చంద్రబాబు . వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గానికి కొత్త కావడంతో ప్రజల్లో తన పట్ల దృష్టి మరలించడానికి టీడీపీకి చెందిన పాత నాయకులకే తిరిగి టీడీపీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో అభాసు పాలవుతున్నారు. కాజులూరు మండలం నామవానిపాలెం గ్రామ సర్పంచ్ అయిన వెంకటసూర్యనారాయణరాజు పాత తరం టీడీపీ నాయకుడు అందులో దివంగత అమలాపురం ఎంపీ బాలయోగికి అత్యంత ఆప్తుడు, మాజీ టీడీపీ మంత్రి చిక్కాలకు అనుచరుడిగా సుదీర్ఘకాలం పని చేసిన వెంకటసూర్యనారాయణరాజును వైసీపీ నాయకుడిగా పేర్కొంటూ టీడీపీ కండువా కప్పడంతో కాజులూరు మండల ప్రజలు నివ్వెరపోయి ఇదెక్కడి వింత పోకడలు ఇదెక్కడి వింత చోద్యం అనుకుంటూ వున్నారు.
అంతే కాకుండా ఈ మధ్యనే శలపాక సర్పంచ్ పోతుల గనిరాజు, దుగ్గుదుర్రు సర్పంచ్ పోతూ వెంకటలక్ష్మి, ఆమె భర్త జ్యోతి కుమార్ ను ఇలానే వైసీపీ నాయకులు అని చెబుతూ టీడీపీ కండువాలు కప్పి ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవాలి అంటూ చేస్తున్న ప్రయత్నాలు ప్రజాల్లో టీడీపీ పార్టీని మరింతగా చులకన చేస్తున్నాయి. అంతే కాకుండా కూటమిలోని మరో పార్టీ జనసేన పార్టీ నాయకులను టీడీపీ లోకి జాయిన్ చేసుకోవడం కూడా చూసే వారికి హాస్యాస్పదంగా వుంది అని రామచంద్రపురం ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఇక వైసీపీ విషయానికి వస్తే పిల్లి సూర్యప్రకాష్ లోకల్ నాయకుడు తన తండ్రి ఇక్కడ పలుమార్లు ఎంఎల్ఏ గా మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ గా కొనసాగుతున్నారు. అదే సమయంలో తోట త్రిమూర్తులు కూడా తన సంపూర్ణ మద్దతు పిల్లి సూర్యప్రకాష్ కు అందించడంతో అటూ ప్రచారంలో ఇటూ గెలుపు అవకాశాల్లో ముందంజలో ఉన్నారు. ఇటూ వాసంశెట్టి సుభాష్ టీడీపీ లో జాయిన్ అయిన నెలకి తన సొంత నియోజకవర్గం అమలాపురంకు కాకుండా రామచంద్రపురం కు ఇంచార్జీగా నియమించడంతో లోకల్ గా కీలక నాయకుడు టీడీపీ టికెట్ ఆశించిన అయిన రేవు శ్రీను టీడీపీకి రాజీనామాకు సిద్దపడ్డారు కానీ పార్టీ పెద్దల సూచన మేరకు ఆగి ప్రస్తుతం పార్టీకి పార్టీ ప్రచారాలకు దూరంగా వుంటున్నారు. మొన్నటి వరకు ఇక్కడ టీడీపీ ఇన్చార్జి అయిన రెడ్డి సుబ్రమణ్యం తనకు తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారి వర్గం మొత్తం ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. వాసంశెట్టి సుభాష్ ఇప్పటికైనా అందరినీ కలుపుకుపోకుండా టీడీపీ వారికే మళ్ళీ మళ్ళీ కండువాలు కప్పుకుంటూ రాజకీయం చేస్తే మాత్రం ఓటమి తథ్యం అని రామచంద్రపురం రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.