పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై జగన్ ప్రభుత్వం అత్యంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఏలూరి మీద కుట్ర అంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తుంది.
జీఎస్టీని ఎగ్గొడుతున్న పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో జనవరి 24 న డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నోవా అగ్రిటెక్ ఆఫీసులో 2019 ఎన్నికలలో టీడీపీ దొంగ ఓట్ల గురించి క్లియర్ గా లెక్కలు దొరికాయి. 2019 ఎన్నికల్లో నల్లధనం వెదజల్లి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. అందుకోసం ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసిన నగదు వివరాలు అన్నీ పోలింగ్ బూత్‌లవారీగా నమోదు చేసి ఉన్నాయి. జీఎస్టీ తీగ లాగితే దొంగ ఓట్ల లెక్కలు భయటపడ్డాయి.
కానీ టీడీపీ నేత వర్ల రామయ్య మాత్రం ఎమ్మెల్యే ఏలూరిని వైఎస్సార్సీపీ వేధిస్తుందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నోవా టెక్ కంపెనీలో ఆ దొంగ ఓట్ల డైరీ దొరకకుండా తప్పుడు కేసులు మోదపలేదు.. దొరికిన సాక్ష్యాల ఆధారంగానే ఏలూరి సాంబశివరావు మీద డీఆర్ఐ అధికారులు దొంగ ఓట్ల కేసులు పెట్టారు. ఈ ఏలూరి సాంబశివరావుపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి.