విత్తు నుండి విక్రయం వరకూ రైతుకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వ పనితీరుపై ఈనాడు పత్రిక బురదజల్లుతూ విషపూరిత కథనాలను ప్రచురించింది. ఏపీలో జగన్ సర్కారు రైతులకు మద్దతు ధర అందించడం లేదని అవాస్తవ కథనాలను ప్రచురించి రామోజీరావు వికృతానందం పొందుతున్నారు. వాస్తవానికి దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర దక్కేందుకు జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది.
అంతేకాకకుండా కేంద్ర ప్రభుత్వ మద్దతుధరలేని పంటలకు కూడా మద్దతు ధరను చెల్లించడం రైతుల పట్ల జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. రైతులకు గ్రామ స్థాయిలో రోజువారీ పంటల ధరలు తెలియాలనే ఉద్దేశ్యంతో 2020 జూన్ లో సీఎం యాప్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అన్నిరకాల పంటల రోజువారీ ధరలను తెలుసుకోవచ్చు. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఫామ్ గేట్ల వద్దనే పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. భారత ఆహార సంస్థ నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఎలాంటి లోపాలకు తావు లేకుండా పారదర్శకమైన కొనుగోళ్ల ప్రక్రియను జగన్ ప్రభుత్వం అమలు చేస్తుంది.
గత ప్రభుత్వం కంటే రెట్టింపు ధాన్యం సేకరించిన జగన్ ప్రభుత్వం
గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు మొత్తం ఆ ఐదేళ్లలో 2,65, 10,747 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 17,94,279 మంది రైతుల వద్ద నుంచి గత టీడీపీ ప్రభుత్వం సేకరించి, దీనికి గానూ మొత్తం రూ.40,237 కోట్లు ఖర్చు చేసింది. కాగా జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు మొత్తం 37,33,581 మంది రైతుల వద్ద నుంచి 3,37,78,882 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.64,686 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. రైతులకు ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో ఈ గణాంకాలను గమనిస్తే అర్థం అవుతుంది.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు అవసరమయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్లు, లేబర్, ట్రాన్స్పోర్టు) ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో జీఎల్టీ ఖర్చులు రైతులకు భారంగా ఉండేవి. కానీ జగన్ ప్రభుత్వం ఈ ఖర్చులను రైతులకు అందిస్తూ వారికి అండగా నిలబడుతుంది. గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబంధించి 2022 – 23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లను జగన్ ప్రభుత్వం జమ చేసింది. గోనె సంచులు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. జగన్ ప్రభుత్వం ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తూ ఈ పరిస్థితికి చెక్ పెట్టింది.
ఇలా ప్రతీ దశలో రైతులకు అండగా నిలుస్తూ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, మద్దతుధర లేని పంటలను కూడా కొనుగోలు చేస్తూ, విత్తు నుండి విక్రయం వరకూ జగన్ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంటే ఈనాడు ద్వారా విష ప్రచారానికి దిగడం రామోజీ ఓర్వలేని తనానికి మచ్చుతునకగా చెప్పొచ్చు. తన అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు నోరు తెరవని రామోజీ గత ప్రభుత్వం కంటే రెట్టింపు స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వం రైతులకు మేలుచేస్తుంటే మాత్రం కడుపు మంటతో రగిలిపోతున్నాడు. ఇలా రైతుల మద్దతు ధర విషయంలో అసత్య ప్రచారానికి దిగిన ఈనాడు కథనాన్ని ప్రజలంతా ముక్త ఖంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది.