విభిన్నంగా, వినూత్నంగా, వాస్తవికంగా ఆలోచించటంలో, కీలక అంశాన్ని స్పష్టంగా గుర్తించడంలో సరైన సమయంలో అంతే స్పష్టంగా చెప్పడంలో జగన్ అందరికన్నా ఒకడుగు ముందే ఉంటారనటానికి ఈ రోజులు సభలో జగన్ లేవనెత్తిన ఒక అంశం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలుచేస్తూ దశలవారీగా పెన్షన్ పెంచి అందిస్తున్న జగన్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుండి రూ. 3000 ను లబ్దిదారులకు అందజేస్తుంది.
కాగా నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన పెన్షన్ల పెంపు బహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని తనదైన శైలిలో గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే ఇప్పటి జగన్ ప్రభుత్వం ఎంత మెరుగ్గా పెన్షన్లను అందజేస్తుందో ఉదాహరణలతో వివరించారు. వాస్తవానికి జగన్ మేనిఫెస్టోలో పెన్షన్ పెంపు హామీ ఇవ్వడంతో అప్పటి బాబు ప్రభుత్వం హడావిడిగా ఎన్నికలకు రెండు నెలల ముందు నుండి 2000 రూపాయల పెన్షన్ అందించడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ఇప్పటికీ ఊదరగొడుతూ బాబు భజన చేస్తూనే ఉండటం విశేషం.
ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ అందించిన బాబు బండారాన్ని ఎవరూ ఊహించని లెక్కలతో సీఎం జగన్ బయటపెట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నెలకు వెయ్యి చొప్పున కేవలం రూ.58వేలు మాత్రమే లబ్దిదారులకు లభించింది. కానీ జగన్ ప్రభుత్వంలో పెన్షన్ పొందే లబ్దిదారులకు ఐదేళ్ల కాలంలో లభించిన మొత్తం రూ.లక్షా 47వేలు కావడం గమనార్హం. ఈ విషయాన్ని జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించడం విశేషం. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వారికే పెన్షన్ దక్కేది. వాటిని తీసుకోవడానికి కూడా లబ్ధిదారులు ఇబ్బంది పడేవారు.
కానీ ఆ పరిస్థితికి చెక్ పెడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వ సాయం లభించేలా సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వాటిని లబ్దిదారులకు చేరవేసేందుకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లను నియమించారు. దాంతో చంద్రబాబు హయాంలో కంటే రెట్టింపు స్థాయిలో అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందడానికి మార్గం సుగమం అయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ల సంఖ్య 29,51,760 కాగా మొత్తం పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. ఈ ఏడాది జనవరి ఒకటి నుండి 66.34 లక్షల పెన్షన్లపై ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న వ్యయం అక్షరాలా రూ.23,556 కోట్లు కాగా ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా రూ. 83,526 కోట్లను లబ్దిదారులకు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కింది. నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి పెన్షన్ అందించేందుకు జగన్ ప్రభుత్వం నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లకు చేరడం గమనార్హం. కానీ గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకూ పెన్షన్లు అందించేందుకు అయిన ఖర్చు కేవలం 400 కోట్లు మాత్రమే. అంకెల్లో కనబడుతున్న ఈ తేడాను గమనిస్తే దేశం మొత్తంలో ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మాత్రమే అని ప్రజలకు అవగతమవుతుంది