‘ఆడది కనిపిస్తే ముదై్దనా పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తు ఎన్టీ రామారావు తనయుడు, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి వియ్యకుండు నందమూరి బాలకృష్ణ. గతంలో ఓ సినీ ఫంక్షన్లో ఆయన తన అభిమానులకు ఈ విధంగా హితబోధ చేశారు. పైకి మాత్రం నీతులు చెప్పే ఈ హీరో కామాధుండని పలు సందర్భాల్లో హీరోయిన్లు వ్యాఖ్యానించారు. ప్రెస్మీట్లు, సినిమా కార్యక్రమాల్లో ఆయన అలాగే ప్రవర్తించిన సందర్భాలున్నాయి. అర్ధరాత్రి వేళల్లో తాగి నటీమణుల గదుల డోర్లు కొడతాడని ఆయనపై అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. సినీ రంగంలోనూ ఇదే ప్రచారముంది.
తాజాగా వెన్నెరాడై నిర్మల అనే తమిళ సీనియర్ నటి ఇంటర్వ్యూలో బాలకృష్ణ పేరు చెప్పకపోయినా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్లో తన కంటే చిన్నవాడైన నటుడు అర్ధరాత్రి ఏడిపించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. బాలకృష్ణతో ఈమె సీమ సింహం అనే సినిమాలో నటించారు. తెలుగుదేశం శ్రేణులు ఎక్కడా తమ నటుడి పేరు చెప్పలేదని అంటున్నా.. ఇలాంటి పనులు చేసేది ఆయనేనని గతంలో సంఘటనలు గుర్తు చేస్తున్నాయి.
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే బాలకృష్ణతో లెజెండ్, లయన్ అనే సినిమాలు చేశారు. ఆ సమయంలో హీరో వల్ల తను పడిన ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. షూటింగ్లో వారంతా ఆయనకు సపోర్టు చేయడం బాధ అనిపించిందని, సౌత్ సినిమాలపై ఆసక్తి పోయిందన్నారు. విచిత్ర అనే నటి కూడా భలేవాడివి బాసు సినిమా సమయంలో తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తే తెలుగు తమ్ముళ్లు ఆమెపై అసభ్యకరంగా మాట్లాడారు. సినీ ఇండస్ట్రిలో బాలకృష్ణ వ్యవహార శైలిపై చాలా విమర్శలున్నాయి.
తనపై పడిన కామాంధుడనే ముద్రను చెరిపేసేందుకు బాలకృష్ణ సినిమాల ద్వారా ప్రయత్నిస్తుంటారని చెబుతుంటారు. ఇటీవల భగవంత్ కేసరి సినిమాలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి డైలాగులు చెప్పిన ఆయన గతంలో డిక్టేటర్ అనే సినిమాకు సంబంధించిన ప్రెస్మీటలో హీరోయిన్ అంజలిని అసభ్యకరంగా తాకి అభాసుపాలయ్యారు. ఇప్పటికే అభిమానుల్ని చావబాదుతాడని పేరుంది. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం కవర్ చేసేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఆయన ఆడవారితో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని ఏనాడూ చెప్పరు. ఏవో సేవా కార్యక్రమాలు చేస్తుంటారని డైవర్ట్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా పేజీల్లో జరిగే భజన సరేసరి. ఇబ్బంది పడిన మహిళలను బాధితులుగా చూడాలి. కానీ టీడీపీ వారిపైనే అభాండాలు వేస్తుంది. ఇది నీచత్వమని తెలిసినా సిగ్గు లేకుండా బాలకృష్ణను వెనుకేసుకురావడం కొసమెరుపు.