రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కానున్న బద్వేల్ సెంచురీ ఫ్లైవుడ్.
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్దికై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషి వల్ల రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. గత నాలుగున్నరేళ్ళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఇన్ఫోసిస్, లారస్ లాబ్స్ లాంటి ఎన్నో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.. తద్వారా యువతకు ఉద్యోగాలు లభించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్ లోనే కానీ రాష్ట్రంలో కనపడిన అభివృద్ధి బహు స్వల్పం .
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలోనే అతిపెద్ద ప్లైవుడ్, బ్లాక్ బోర్డ్ మరియు పార్టికల్ బోర్డ్ తయారీ సంస్థ సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ కడప జిల్లాలోని బద్వేల్లో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం డిసెంబర్ 23, 2021 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లా గోపవరం వద్ద మూడు దశలలో రూ. 1600 కోట్ల పెట్టుబడితో 589.23 ఎకరాల్లో సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శరవేగంగా ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసుకొంది. బహుశా ఈ డిసెంబర్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి ఉత్పత్తులను ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమలో ఎండీఎఫ్ (మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్), హెచ్పీఎల్ (హై ప్రెజర్ ల్యామినేట్స్) ఉత్పత్తులను తయారు చేయనున్నారు. సుబాబుల్, జామాయిల్, సర్వి తదితర కర్ర ద్వారా ఈ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తారు.
సెంచూరీ ప్లైబోర్డ్స్ కంపెనీకి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, అస్సాం, గుజరాత్, పంజాబ్ మరియు ఉత్తరాఖండ్లలో యూనిట్లు ఉన్నాయి. తొలుత ఈ పరిశ్రమను చెన్నైలో ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతో బద్వేల్లో సెంచరీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 2 వేల మంది చదువుకున్న నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, కర్రసాగు, సరఫరా ఇతర మార్గాల ద్వారా దాదాపు 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందు శ్రీకాళహిస్తిలో గ్రీన్ ప్లైవుడ్ కు సంబంధించిన చిన్న పరిశ్రమ ఉండగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు వద్ద మరో చిన్న పరిశ్రమ మాత్రమే ఉంది. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగవుతున్న జామాయిల్, సుబాబుల్ కర్ర వినియోగానికి ఈ పరిశ్రమల స్థాయి సరిపోవడం లేదు. దీంతో రాజమండ్రి వద్ద ఉన్న ఏపీ పేపర్ మిల్తోపాటు ఇతర రాష్ట్రాల్లోని మిల్లులకు ఈ ప్రాంతాల నుంచి కర్ర తరలించాల్సి వస్తోంది. డిమాండ్ లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో ఏడాదికేడాదికి జామాయిల్, సుబాబుల్ సాగును రైతులు తగ్గిస్తున్నారు. ఇప్పుడు గోపవరం వద్ద భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండడంతో ఆరు జిల్లాల పరిధిలో సాగవుతున్న కర్రను స్థానికంగానే వినియోగించుకునే అవకాశం కలగనుంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించనుంది.
సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమకు మొదటి ఫేజ్లో ప్రతిరోజు 2 వేల టన్నుల కర్ర, రెండవ ఫేజ్ నాటికి 4 వేల టన్నుల కర్ర అవసరమవుతుంది. మూడవ ఫేజ్ లో 10 వేల టన్నుల కర్ర అవసరం కానుంది. ఆంధ్రప్రదేశ్ లోని 6 జిల్లాలలో కర్రసాగు అధికంగా ఉండడంతో యాజమాన్యం ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
వెనుకబడిన బద్వేలు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో ఇప్పటికే బ్రహ్మంసాగర్ ద్వారా నియోజకవర్గంలోని మొత్తం ఆయకట్టుకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గోపవరం వద్ద సెంచురీ ప్లైబోర్డ్స్ పరిశ్రమను నెలకొల్పి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కేవలం 24 నెలల్లో రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్, 2023 లో ప్రారంభించి ప్రొడక్షన్ మొదలుపెట్టబోతున్నారు.
ఎప్పుడెప్పుడు పాదయాత్ర ఆపేద్ధామా అనే హడావిడిలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగట్లేదు. జగన్ ఒక్క కంపెనీ కూడా తేలేదు అంటూ కారు కూతలు కూస్తున్న లోకేష్ నిజాలు తెలుసుకోని ప్రజల్లోకి రావడం మంచిది.