ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల అనంతరం ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే..
మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లుతో కూటమి జెండాలు జతకట్టి వస్తున్నారు. తాడిపత్రి.. సిద్ధమేనా… తాడిపత్రి నుంచి ఇచ్చాపురం వరకు సిద్ధమైన మనమంతా ఎన్నికల యుద్ధానికి గేరు మారుద్దామా?.. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు, ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు, అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు తమ నైజంగా, కూటమిగా, గుంపులు గుంపులుగా.. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. మీ ఒక్కడు జగన్ మీద, మీకు మంచి చేసిన ఒక్క జగన్ మీద ఈ పేదల వ్యతిరేకులను, ఈ మోసగాళ్లను మన ఓటుతో పోలింగ్లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా?
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇదీ చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇది మళ్లీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తున్న మేనిఫెస్టోకు అర్థం. బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. వదల బొమ్మాళీ వదల అంటూ మన ప్రతి పేదవాడి ఇంటికీ వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపుపతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి.
నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో. నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద. నా మేనిఫెస్టోను నూటికి 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఖురాన్, భగవద్గీతగా భావించి మంచి చేసి, ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దెవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఎప్పుడూ ఎవ్వరూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అంటే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేకుండా వెళ్లాయి. ఇలాంటి లంచాలు లేని, వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికీ జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి, చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు, దీవెనలు అడుగుతున్నాడు.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు.. రాష్ట్రం విడిపోయిన తర్వాత దశాబ్దాలుగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు అయితే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే ఇచ్చినది అక్షరాలా మరో 2.31 లక్షల ఉద్యోగాలు. ఈ పిల్లలంతా నా తమ్ముళ్లు, నా చెల్లెళ్లంతా ఈరోజు గ్రామ సచివాలయాల్లో కనిపిస్తున్నారు. వీళ్లంతా ఈరోజు మన మెరుగుపడిన ఆస్పత్రుల్లో కనిపిస్తున్నారు. మెరుగుపడిన బడులల్లో కనిపిస్తున్నారు. 2.31 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రతి సందర్భంలోనూ నేను నానానా అని పిలుచుకునే ఈ సామాజికవర్గాలకు, ఈ పేదలకు ఏకంగా 80 శాతం ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా ఉంది అంటే ఈ 58 నెలల పాలనలోనే అని, మీ బిడ్డ చేసి చూపించి సవినయంగా తెలియజేస్తూ మీ దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు.
ఎప్పుడూ చూడని విధంగా మన గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నచేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తోంది. గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. ఆ గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తోంది. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల కాలంలోనే తీసుకువచ్చి చూపించి మీ సమక్షంలో నిల్చుని మీ బిడ్డ మీ ఆశీస్సులు,దీవెనలు కోరుతున్నాడు. ఈ 58 నెలల కాలంలోనే ఎలా మారింది మన గ్రామం అని చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు, దీవెనలు కోరుతున్నాడు. ఆలోచన చేయమని కోరుతున్నాను.
గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా వారి ఇంటికే ఈరోజు పెంచిన పెన్షన్ రూ.3 వేలు నేరుగా నా అవ్వాతాతల ఇంటికే వస్తున్న పరిస్థితులు. మొట్ట మొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇంటి వద్దకే రేషన్ వస్తున్న పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇంటి వద్దకే మన క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్.. ఈరోజు మనకు ఏ సర్టిఫికెట్ కావాలాన్నా ఈ 58 నెలల కాలంలోనే మన గడపవద్దకే వస్తున్న పరిస్థితులు. ఎప్పుడూ జరగని విధంగా ఇంటి వద్దకే ఈరోజు వైద్య సేవలు అందుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు జరుగుతోంది. ఈ విప్లవాత్మకమార్పులన్నీ కూడా ఎవరూ ఊహించని విధంగా మన ఇంటి వద్దకే, మన ఇంటికే వచ్చే వ్యవస్థ వచ్చింది ఎప్పుడు అంటే అది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా తెలియజేస్తూ చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిల్చుని మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు.
గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మహిళా సాధికారతకు దన్నుగా ఓ అమ్మ ఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా? చూశారా అని అడుగుతున్నాను. గతంలో ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ అని ఎప్పుడైనా మీరు విన్నారా? అడుగుతున్నాను. గతంలో ఎప్పుడైనా మీరు ఓ చేయూత గురించి, ఓ కాపు నేస్తం గురించి, ఈబీసీ నేస్తం, పూర్తి ఫీజులు కడుతూ విద్యాదీవెన, విద్యా దీవెనతో పాటు వసతి దీవెన, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు గురించి విన్నారా? మనగ్రామంలోనే మహిళా పోలీస్, మన ఫోన్లోనే ఒక దిశ యాప్, మహిళా సాధికారతకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా? చూశారా? ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మొదటిసారిగా అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు ఆ అక్కచెల్లెమ్మలకు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఆ అక్కచెల్లెమ్మల సమక్షంలో ఈరోజు నిలబడి అక్కా.. చెల్లెమ్మా.. మీకు మంచి చేశాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వంపై ఉంచాలని సవినయంగా మీ బిడ్డ కోరుతున్నాడు.
మీరెప్పుడైనా చూశారా? రైతన్నకు పెట్టుబడి సాయంగా పంట వేసే సమయంలోనే రైతన్నలను ఆదుకుంటూ ఓ రైతు భరోసా అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా చూశారా? రైతన్నకు తోడుగా ఉంటూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి పంట విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్న కార్యక్రమం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతోంది. రైతన్నలకు సున్నా వడ్డీకే పంట రుణాలు, 9 గంటలు పగటిపూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, సమయానికే రైతన్నకు ఇన్ పుట్ సబ్సిడీ, రైతన్నకు ఉచిత పంటల బీమా, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దళారీ లేని వ్యవస్థను తీసుకొచ్చి ఎంఎస్పీ తో కన్నా ఎక్కువ రేటు ఇచ్చి పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటల కొనుగోలు కూడా ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్ననూ ఈరోజు అడుగుతున్నాడు. జరిగిన మంచిని చేసి చూపించి మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇవ్వాలని ఈరోజు మీ బిడ్డ కోరుతున్నాడు.
మొట్ట మొదటిసారిగా మీ బిడ్డ సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా మీ బిడ్డ చేసి చూపించాడు. ప్రతి అడుగులోనూ నానానానా అంటూ పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని, వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీలోనూ, నాన్ డీబీటీలోనూ ఏకంగా 75 శాతం పైచిలుకు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర కేవలం ఈ 58 నెలల కాలంలోనే. 50 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి మరీ ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర ఈ 58 నెలల కాలంలోనే. ఏకంగా మంత్రి మండలిలో 68 శాతం మంత్రి పదవులు ఏకంగా ఈ వర్గాలకే అందిన చరిత్ర ఎప్పుడైనా జరిగిందంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతున్నాను.
ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. 25 ఎంపీ స్థానాలున్నాయి. ఈ 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే ఏకంగా 100 సీట్లు నేను నానానానా అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలకే ఏకంగా 100 సీట్లు కేటాయించిన చరిత్ర ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో చేసిందా? అని అడుగుతున్నాను ఈరోజు ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి సామాజిక న్యాయం చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో నిల్చుని మీ బిడ్డ చల్లని దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు.
మరో వంక ఆ చంద్రబాబును, ఆ కూటమిని చూడమని కోరుతున్నాను. మరోవంక మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లు, పొత్తులు, మేనేజ్ మెంట్లు.. వీటిని నమ్ముకుని ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను. ఈరోజు మీ బిడ్డ పేరు చెబితే మీకు నేను ఇంతకు ముందు చెప్పిన ఇన్ని పథకాలు, వ్యవస్థలు గుర్తుకొస్తాయి. మరి నేను ఇక్కడే నిలబడి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబును అడుగుతున్నాను. నేరుగా నా ప్రజల్ని అడుగుతున్నాను. పేదలను అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము అయినా గుర్తుకు వస్తుందా? అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటున్న ఈ మనిషి పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈరోజు ఇలాంటి అబద్ధాలు, మోసాలతో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాల మేనిఫెస్టోను మరొక్కసారి వీళ్లంతా ముందుకు తోస్తున్నారు. కాబట్టే ఆ మేనిఫెస్టో గురించి మీ అందరికీ కూడా నాలుగు మాటలు చెబుతాను.
ఇదేమిటో మీరంతా చూస్తున్నారా? (టీడీపీ మేనిఫెస్టోను చూపుతూ) ఇది 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న ముగ్గురి ఫొటోలు, చంద్రబాబు నాయుడు, ఆయన పక్కనే దత్తపుత్రుడు, ఆయన పక్కనే ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీగారు. వీళ్ల ముగ్గురి ఫొటోలతో ఇదే కూటమిగా ఏర్పడి 2014లో చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ 2014లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? అని అడుగుతున్నాను. ఈ పాంప్లెట్ లో తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా? ఆ ఈనాడు, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లలో అడ్వర్టైజ్ మెంట్లు గుర్తున్నాయా? అప్పట్లో అడ్వర్టైజ్ మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మంగళ సూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది.. వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్న అడ్వటైజ్ మెంట్లు గుర్తున్నాయా?
మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో వీళ్లు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా? వీళ్లు రాసినది.. రైతులకు రుణ మాఫీ రూ.87,612 కోట్లపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రుణాల మాఫీ చేశాడా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీల్లో ఇంకా ముందుకు పొమ్మంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. మరి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. రూ.25 వేలు కథ దేవుడెరుగు.. ఏ ఒక్కరి బ్యాంకు అకౌంట్లో అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. మరి రూ.2 వేలు చొప్పున 60 నెలలు.. అంటే ప్రతి నెలా రూ.1.20 లక్షల నిరుద్యోగభృతి ఇచ్చాడా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఇచ్చాడా? కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పోతే రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు అయ్యాయా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ తాడిపత్రిలో కనిపిస్తోందా?
మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? అని మీ అందరితో కూడా అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా అని అడుగుతున్నాను. ఏమన్నా నమ్మవచ్చా.. ఏమక్కా నమ్మవచ్చా.. ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడి మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటున్నారు. సూపర్ సెవెన్ అంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం, ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. మరి నమ్మొచ్చా? అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి మోసాలతో, అబద్ధాలతో యుద్ధం చేస్తున్నాం.
ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తుమారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటళ్లు మెరుగు పడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లో ఉండాలి. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మరొక్కసారి కోరుతూ మీ బిడ్డ సెలవు తీసుకుంటున్నాడు. అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.