ఈ నెల 31న విజయవాడలో జరిగనున్న సామాజిక సాధికార యాత్ర మహాసభ సందర్భంగా వాటి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి విజయసాయి రెడ్డి మంగళగిరి విచ్చేసారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి లో మూడో సారి వైసీపీయే గెలవనుందని ధీమా వ్యక్తం చేసారు.
ఈ నియోజకవర్గం నుంచి గతంలో తెలుగుదేశం పార్టీకి గెలిచిన దాఖలాలు లేవన్నారు. లోకేష్ పోటీ చేస్తే, ఈ సారి లోకేష్‌కు ఇక్కడ ఓటమి తప్పదన్నారు. వైసీపీ నుండి బిసీ కేండిటేట్గా చేనేత వర్గానికి చెందిన అభ్యర్థి పోటీలో ఉండబోతున్నట్టు తెలిపారు.
దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ గారిదేనని అన్నారు. బీసీ బడుగు వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుని తెలుగుదేశం పార్టీ కి బుధ్ధి చెబుతారనీ, రాష్ట్రంలో జగన్‌ని మళ్ళీ సీయంగా ఈ బడుగు వర్గాల ప్రజలే గెలిపిస్తారని చెప్పారు.