– భూ యజమానులకు అండగా నిలిచే యాక్ట్‌పై బాబు వివాదాస్పద వ్యాఖ్యలు
– అన్ని పరిశీలించి కేంద్రం ఆమోదించిన వ్యవస్థపై అక్కసు
– గతంలో ఏనాడూ రెవెన్యూ సమస్యలను పట్టించుకోని టీడీపీ
– జగన్ హయాంలో భూముల రీసర్వే.. చుక్కల భూములకు పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం.. దేశ చరిత్రలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం భూ యజమానులకు భరోసా కల్పిస్తోంది. అయితే ప్రభుత్వం ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నా చంద్రబాబుకు మాత్రం నచ్చలేదు. దీంతో అధికారంలోకి రాగానే భూ రక్షణ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించేశారు.
ఇదీ తేడా..
బాబు సీఎంగా చేసిన సమయంలో రెవెన్యూ సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వివాదాలు ఘర్షణలకు దారి తీసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. కోర్టు కేసులతో చాలామంది ఆర్థికంగా చితికిపోయారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే గ్రీవెన్స్డేల్లో భూ సమస్యలపై వినతులు వెల్లువలా వచ్చేవి. అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగేవారు. జగన్ సీఎం అయ్యాక పరిస్థితి పూర్తిగా మారింది. దశాబ్దాలుగా ఉన్న చుక్కల భూముల సమస్యను ఒక్క జీఓతో పరిష్కరించారు.lఅసైన్మెంట్ భూములకు సంబంధించి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ హయాం తర్వాత ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా మన రాష్ట్రంలోనే చేపట్టారు. అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేసి హద్దులు చూపిస్తున్నారు. భూమి యజమానులకు ఎటువంటి ఖర్చు లేదు. ఈ కార్యక్రమంతో గ్రామాల్లో భూవివాదాలకు తావు ఉండదు. అలాగే జగన్ సర్కారు చేపట్టిన మరో అద్భుత కార్యక్రమం ల్యాండ్ టైట్లింగ్ చట్టం.
ఈ చట్టం ప్రకారం..
ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూమి హక్కుల చరిత్ర మారుతుంది. 33 సంవత్సరాలుగా దేశంలో ఈ వ్యవస్థ కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే సాకారం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్ సీఎం అయ్యాక 2019 జూలైలో దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపారు. పలు మార్పుల తర్వాత కొంతకాలం క్రితం దానికి ఆమోదముద్ర పడింది. గతేడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2023 అమల్లోకి వచ్చింది. దీని వల్ల అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా సరే హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్ని పరిష్కారమయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం కన్‌క్లూజివ్ రికార్డు వస్తుంది. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి అవకాశం ఉండదు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఉంటాయి. కొత్త యాక్ట్ మేరకు భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. టైటిల్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఈ చట్టం తేవడం గొప్ప ముందడుగని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టైటిల్‌కు భద్రత ఉంటుంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్నవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలకు తావు ఉండదు. ఆర్థిక ప్రగతి బాగా పుంజుకునే అవకాశముంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
నేనొస్తే తీసేస్తా..
భూ యజమానులకు భరోసా కల్పించేందుకు తీసుకొచ్చిన చట్టంపై టీడీపీ ఇష్టానుసారంగా మాట్లాడుతోంది. కొన్ని వర్గాలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని తిట్టిస్తోంది. తాజాగా బాబు ఒకడుగు ముందుకేసి తాను సీఎం అయ్యాక ల్యాండ్ టైట్లింగ్ చట్టం (భూరక్షణ చట్టం)ను తీసేస్తానని ప్రకటించి ప్రజల్లో చులకన అయ్యారు. గురువారం గుడివాడలో జరిగిన రా కదలి రా.. కార్యక్రమంలో ఆయన ఈ మాటలు అన్నారు. దీని వల్ల పేదలకు మంచి జరుగుతుంటే.. భూములను దోచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తనదైన శైలిలో అబద్ధం చెప్పారు. పోనీ ఈ చట్టంలో ఫలానా మార్పులు తెస్తే బాగుంటుందని.. కానీ అలా చేయలేదు అన్నాడా.. అంటే అదీ లేదు. ఇలా చేస్తే పేదలకు అనుకూలం అని సలహా చెప్తాడా అనుకుంటే అలానూ చేయలేదు. ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసి ఎన్నో తర్జనభర్జనల తర్వాత చట్టాన్ని తెచ్చింది. దానికి కేంద్రం ఆమోదముద్ర పడింది. ఈ విషయాన్ని బాబు పట్టించుకోకుండా రద్దు చేసి పాడేస్తానని చెప్పి అభాసుపాలయ్యాడు.