నిజమే సిద్ధం సభల్లో జనాలు లేరు. గ్రాఫిక్స్ లో జనాలని ఉన్నట్టు చూపించి లైవ్ ని లేట్ గా ఇస్తున్నారు.. కాసేపు అదే నిజం అనుకుందాం..జగన్ మీద వ్యతిరేకత చాలా ఉంది, జగన్ పని అయిపోయింది, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్ ఓడిపోతున్నాడు…. పొద్దున లేస్తే ఇవే కదా బాబు అండ్ కో మాట్లాడే మాటలు… ఇవి కూడా నిజాలే అనుకుందాం..
జగన్ కి ఇన్ని నెగటివ్ పాయింట్ లు ఉన్నప్పుడు వారంతా పొత్తుల కోసం వెంపర్లాడటం దేనికి, జగన్ కోసం జనాలే రాకపోతే ఇక వారికి భయం దేనికి? సర్వేలన్నీ వారే గెలుస్తాయని చెప్తుంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని జనసేనతో పొత్తు పెట్టుకున్నాం అని చెప్తారు.. తెలుసు… జగన్ కి అంత వ్యతిరేకత ఉంటే కేవలం 5.6% లోపే ఓట్ షేర్ ఉన్న జనసేనతో బాబుకేం పని, ఒంటరిగా పోటీ చేసినా భయంకరంగా జగన్ పై ఉన్న వ్యతిరేకత వలన టీడీపీ వారు సునాయాసం గా గెలవచ్చు కదా? జగన్ పై వ్యతిరేకత ఉంటే కేవలం 1% ఓట్ షేర్ ఉన్న బీజేపీ తో అవసరం ఏమొచ్చింది?
ఎందుకంటే బాబుకు కూడా తెలుసు… జగన్ కి జనంలో బలం ఉంది. జగన్ తను చెప్పిన పనులన్నీ చేశాడు, తను చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు అని జనాల్లో క్రెడిబిలిటీ ఉంది. అవినీతి తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమాన్ని అందించాడు, బాబు హయాంలో కన్నా ఎక్కువ రోడ్లు వేశాడు, ఫ్లైఓవర్ లు కట్టాడు, పారిశ్రామిక రంగంలో బాబు కన్నా మూడింతలు పెట్టుబడులు తెచ్చాడు, కరోనా కష్ట కాలంలో దేశం లో ఏ రాష్ట్రం అందించని అంతటి వైద్యం అందించాడు, చేసిన ప్రతీ పనికి లెక్కలు ప్రజలకి ఖచ్చితంగా వివరించగలుగుతున్నాడు. ఇవన్నీ బాబు అండ్ కో కి తెలుసు..
జగన్ ని ఒంటరిగా ఓడించడం బాబు అండ్ కో తరం కాదు.. సింగిల్ గా పోటీ చేస్తే 2029 ఎలక్షన్స్ కి టీడీపీ మనుగడ కూడా ఉండదు. ఇంకో పదేళ్లు ఆ పార్టీ బతికే ఉండాలి అంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ కనీసం చెప్పుకోదగ్గ స్థానాలు గెలుచుకోవాలి. అందుకే బాబు తాపత్రయం. అందుకే 1% షేర్ కూడా లేని బీజేపీ తో పొత్తుకోసం ఢిల్లీలో జాగారం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
గత 15 ఏళ్లుగా జగన్ రాజకీయాల్లో ఉన్నాడు. జగన్ ఎప్పుడు బయటికి వచ్చినా కుప్పలు తెప్పలుగా జగన్ ను చూడటానికి జనాలు వస్తారు. ఓ పెద్ద సినిమా హీరో కన్నా జగన్ కి ఉన్న క్రేజ్ ఎక్కువ,బాలీవుడ్ హీరో ల కన్నా జగన్ తో సెల్ఫీ కోసం ఎగబడే జనాలు ఎక్కువ, జగన్ క్రౌడ్ పుల్లర్, జగన్ అంటేనే జనం.. దాన్ని ఎవరూ మార్చలేరు. మీరే ఎడిట్ చేసుకుని మీరే ఎడిట్ అని పేపర్ లలో రాసుకుని ఆత్మతృప్తి పడినంత మాత్రాన జగన్ వెనుక ఉరుకులెత్తే జనాల పరుగులను ఆపలేరు..