గత రెండు ఎన్నికల నుంచి వైకాపాకు విజయవాడ ఎంపీ సెగ్మెంట్ కి మంచి ఎంపీ అభ్యర్థి దొరకొక ఇబ్బంది పడుతున్న సమయంలో తెదేపాని వీడి వైసీపీలోకి వచ్చిన కేశినేని నాని రాకతో ఒక్కసారిగా బెజవాడ రాజకీయం మారిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నానినీ ఆ పార్టీలో నుంచి పొమ్మనలేక పొగపెట్టారు. ఆసమ్మతితో రగలిపోతున్న నాని వైసీపీ పార్టీ ఆహ్వానం మేరకు పార్టీలో జాయిన్ అయ్యి 2024 ఎన్నికలకు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు.
వైకాపా పార్టీ ఎంపి అభ్యర్థిగా ఖరారయిన తర్వాత తన పార్లమెంట్ స్థానం లో ఉన్న ఏడు నియోజక వర్గాల అభ్యర్థులతో సమన్వయము చేసుకుంటూ అక్కడ ఉన్న అభ్యర్థిత్వ సమస్యలను పరిష్కరించకుంటు ముందుకు వెళ్తున్నారు.
విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ నియోజక వర్గాలు ఉన్నాయి. విజయవాడ ఈస్ట్ కు దేవినేని అవినాష్ కు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ కు పంపింది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ అషిఫ్ ను వైకాపా ఖరారు చేసింది.ఇప్పటికే పశ్చిమలో స్ట్రాంగ్ గా ఉన్న వైకాపా , అసిఫ్ ప్రచారం మొదలుపెట్టి అందరినీ కలుపుకునిపోతూ గడప గడపకు తిరుగుతున్నారు. విజయవాడ ఈస్ట్ సీట్ ఖరారు చేసుకున్న దేవినేని అవినాష్ నియోజకవర్గ పరిధిలో ఆల్రెడీ ఏడాది నుంచే గడప గడప చుట్టేశాడు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకి సీట్ నిరాకరించగా మొదట విముఖత చూపినా, సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెద్దలు కలగచేసుకొని ఎమ్మెల్సీ ఇస్తాం అని విష్ణుకి భరోసా కల్పించి వెల్లంపల్లితో కలిసి పనిచేసేలా ప్రణాళికలు రూపొందించారు. వెల్లంపల్లి సెంట్రల్ నియోజక వర్గ పరిచయ వేదికకు మల్లాది విష్ణు తన అనుచర వర్గం మొత్తం తీసుకొని వచ్చి సెంట్రల్ నియోజక వర్గంలో ఊపు తెచ్చారు.
ఇక టీడీపీ లో విజయవాడ సెంట్రల్ సీట్ కోసం వంగవీటి రాధ, దేవినేని ఉమ సీట్ నాది అంటే నాది అనేలా సోషల్ మీడియాలో ఇద్దరి అనచర వర్గం బాహి బహికి దిగారు. విజయవాడ పశ్చిమ సీటు లోనూ టీడీపీ జనసేన పార్టీల మధ్య అనిశ్చిత ఏర్పడింది, జనసేన నుంచి పోతిన మహేష్ సీటు కోసం తిరుగుతుంటే, టీడీపీ నుంచి బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా సీట్ నాది అంటే నాది అంటున్నారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గా ఉన్న గద్దె రామ్మోహన్ ఎక్కడ పోటీ చేస్తారు అన్న క్లారిటీ ఇంకా లేదు.
నిన్న తిరువూరులో కేశినేని తన పార్లమెంట్ పరిధి లోని ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచి జగన్ కి కానుకగా ఇస్తా అని ఒక ప్రకటన లో తెలిపారు. ఈ విధంగా ఊహించని రీతిలో విజయవాడ రాజకీయం మలుపులు తిరుగుతోంది.