చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చేసింది.. ఆ దేశం నుంచి అది వస్తోందంటూ ఎల్లో మీడియా ఊదరగొట్టేది. తీరా చూస్తే అలాంటేమీ ఉండేది కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మాత్రమే ఆ ప్రాజెక్ట్‌లు కనిపించేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అలాంటి హడావుడి ఏమి లేదు. సైలెంట్‌గా అభివృద్ధి పనులు చేస్తూ చేతల ప్రభుత్వమని ఎన్నోసార్లు నిరూపించింది. 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టును సిద్ధం చేశారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పనిని జగన్ చాలా సులువుగా చేసి చూపించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఆయనకు, మాజీ సీఎం చంద్రబాబుల మధ్య వ్యత్యాసం స్పష్టం కనిపిస్తుంది.
రామాయపట్నం పోర్టు.. నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసుల కల ఇది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తూర్పుతీర ప్రాంతంలోని గుడ్లూరు మండలం మొండివారిపాళెం వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కీలక అభివృద్ధి ప్రాజెక్ట్. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు రామాయపట్నం వద్ద పైలాన్ ఆవిష్కరించి షో చేశారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించింది. కేంద్రంతో మాట్లాడి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. 2022 జూలైలో సీఎం దీని నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేస్తున్నారు. సముద్రం లోపలికి బ్రేక్‌వాటర్ ఫీడర్ల నిర్మాణం చేపట్టారు. అలల నుంచి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ బ్రేక్‌వాటర్ ఫీడర్ల నిర్మాణాలు చేస్తుంటారు. ప్రధాన పోర్టు నిర్మాణ ప్రాంతానికి నార్త్, సౌత్ దిశల్లో ఫీడర్ల నిర్మాణాలు చేశారు. వీటి నిర్మాణానికి రోజుకు 10 వేల టన్నుల రాక్స్ (బండరాళ్లు) ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ నుంచి తెప్పించారు.
తొలిదశలో 34.04 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్ సామర్థ్యంతో రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్ బెర్త్‌లు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ సంస్థతో సమావేశాలు నిర్వహిస్తూ పనులు శరవేగంగా జరిగేలా చూశారు. దీంతో ఇప్పటికే బల్క్ బెర్త్ పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలో తొలి నౌకను తీసుకొచ్చి లంగరు వేయడం ద్వారా వాణిజ్య పరంగా పోర్టును ప్రారంభించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలను రెడీ చేసింది. వచ్చే ఆరు నెలల్లో మిగిలిన మూడు బెర్తులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదలుపెట్టిన 18 నెలల్లోనే రామాయపట్నం పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమైందంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. జగన్ విజన్‌కు ఇది నిదర్శనమని ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. పోర్టు నిర్మాణం యువతకు వరంగా మారింది. వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
పోర్టుకు సమీపంలోని తెంటు గ్రామం వద్ద 28 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేసింది. పోర్టు కోసం భూమిని ఇచ్చిన ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి పునరావాసం కల్పించారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం సుమారు రూ.160 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ఈ గ్రామంలో రహదారులు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలను కల్పించారు. పునరావాస గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.20 కోట్ల వరకు వ్యయం చేసింది. పోర్టు కార్యకలాపాలు మొదలైతే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది. దీనికి సంబంధించి భూ సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కావలి తదితర చోట్ల భూములకు డిమాండ్ ఏర్పడింది.