వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చదువుల విప్లవం మొదలయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన ఒక వైపు.. పిల్లల చదువులు మరోవైపు అన్నట్టు పరిపాలన సాగిస్తున్నారు. విద్య మాత్రమే పిల్లల భవిష్యత్తును మాత్రమే మార్చే ఆయుధం అని నమ్మిన వైఎస్ జగన్ అధిక నిధులు చదువులకే ఖర్చు చేస్తున్నారు. బడి చదువులకోసం అమ్మ ఒడి, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, ట్యాబులు అంటూ వివిధ రకాలుగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.. తరువాత పేద మధ్యతరగతి విద్యార్ధుల కోసం జగనన్న విద్యా దీవెన, వసతీ దీవెన లాంటి పథకాలను అమలు చేస్తున్నది. విద్యను పూర్తిగా ప్రభుత్వ బాధ్యతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.
జగనన్న విద్యా దీవెన (ఫీజు రియింబర్స్‌మెంట్) పథకం కింద పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు సంబంధించిన ఫీజుల మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. కాలేజీలకు ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలు) ఒకసారి రీయింబర్స్మెంట్ చేసే ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. బడి చదువులు పూర్తయ్యాక పైచదువులకు ఫీజులు కట్టే స్థోమతలేక రాష్ట్రంలోని ఎంతోమంది తల్లీదండ్రులు పిల్లలను చదివించలేకపోతున్న సమయంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జగనన్న విద్యా దీవెన గొప్ప వరంలా ప్రభుత్వం అమలు చేస్తుంది.. ఏప్రిల్ 28, 2020 న జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది.. ఆరోజు మొదలైన పథకం 56 నెలల కాలంలో నిర్విరామంగా అమలవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో మొత్తంగా 26,98,728 విద్యార్ధులకు 11,901.00 లబ్ధి కోట్ల మేర లబ్ధి చేకూరింది.
గత ప్రభుత్వం బకాయి పెట్టిన 2018–19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు రూ.1,800 కోట్లను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది.
జగనన్న వసతి దీవెన పథకంతో విద్యార్థుల వసతి, భోజన, రవాణా ఖర్చులకు గాను రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. పేదలకు పెద్ద పెద్ద చదువులే లక్ష్యంగా జగనన్న వసతీ దివెన కార్యమాన్ని విజయనగరంలో ఫిబ్రవరి 24, 2020 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోర్సులు (ITI) విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ. 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000 మరియు డిగ్రీ విద్యార్థులకు రూ. 20,000 ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా ఈ నిధులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన తప్పనిసరి చేసింది.
56 నెలల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనాకాలంలో జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఇప్పటివరకు 25,17, 245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది.
పిల్లలకు మనమిచ్చే ఆస్థి విద్య మాత్రమే అని నమ్మే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్..