ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమీషన్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముడురోజుల్లోనే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ లో 385 యఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.3.14 లక్షల రాజకీయ ప్రచార చిత్రాలను కూడా ఈ సంధర్భంగా తొలగించామని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ మీనా వెల్లడించారు.
మూడున్నర కోట్ల విలువైన రాజకీయ పార్టీల మెటీరియల్‌ను సీజ్ చేసింది. అందులో ఎనభై లక్షల నగదు, కోటిన్నర విలువైన మద్యం సీసాలు ఉన్నాయి. మద్యం అమ్మకాలు, నిల్వలపై నిఘా వేసామని, గత ఏడాది మద్యం అమ్మకాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది అమ్మకాలతో పోలుస్తామని, అమ్మకాలలో ఏమైనా హెచ్చులు ఉంటే తగు చర్యలు తీసుకుంటామని ముఖెష్ మీనా తెలిపారు.
రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ అమలులో ఉన్నందున పార్టీలు రాజకీయ ప్రచార మీటింగులు పెట్టుకోవాలి అంటే ముందుగా తగు పర్మిషన్లు తీసుకోవాలని సూచించారు. సువిధ యాప్ ద్వారా ఇప్పటి వరకూ సభల నిర్వహణ కోసమై 398 విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి ఆదేశాలిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఎటువంటి రాజకీయ ప్రచారాలలో పాల్గొనరాదనీ, ఏ పార్టీకీ ఓటేయమని సూచించకూడదనీ.. ఈ నియమం ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులకూ, వాలంటీర్లకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
ఇంతే కాక, ఎన్నికల కోడ్ మీరి ప్రవర్తించినందుకు ముఖెష్ మీనా ఇప్పటికే టీడీపీకి నోటీసులు ఇచ్చి ఉన్నారు. వైకాపా నాయకుడు జగన్‌పై సోషల్మిడియాలో వచ్చిన ట్రోల్స్‌ను వెంటనే నిలిపివేయాలని లేదా చర్యలు తప్పవని తెలిపారు. ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర ప్రచారంలో పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు గ్లాసును వాడటాన్ని ఉదహరిస్తూ… ఎవరైనా ఆ ప్రచార చిత్రంపై కంప్లయింట్ ఇస్తే విచారిస్తే ఆమెని తెలిపారు. ఓటర్లందరూ సువిధ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎటువంటి ఇబ్బంది కలిగినా అందులో కంప్లయింట్ ఇవ్వొచ్చని తెలిపారు.