విద్యార్థులకి విద్యతో పాటు మంచి నడవడిక , సమాజం పట్ల , వ్యవస్థలపట్ల గౌరవం పెరిగేలా వారికి విద్యాబుద్దులు నేర్పవలసిన ఉపాధ్యాయులే దారి తప్పి, నీతి మాలిన చర్యలకు పాల్పడటం సమాజాన్ని కలవరపరిచే అంశం. ప్రజలకి ఓటు హక్కు విలువని తెలియచేస్తూ వారిని పోలింగ్ బూతుల దాకా వెళ్ళీ నచ్చిన పార్టీకి ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభావితం చేయాల్సిన ఉపాధ్యాయులో కొంతమంది తమ ఓటునే డబ్బుకు అమ్ముకోవడం ఆ వృత్తినే అగౌరపరిచేలా ఉంది.
వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ వారికి ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ కు 5 వేలు లంచం తీసుకున్న కేసులో ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు. వీరు తమ ఓటుని అమ్ముకున్నారని విచారణలో తేలడంతోనే కలెక్టర్ దినేష్ కుమార్ చర్యలు తీసుకునట్టు తెలుస్తుంది. విలువైన ఓటుని డబ్బుకు అమ్ముకున్న వీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం ఆ వృత్తికే అవమానం గా పరిగణించవచ్చు.