రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కానుంది. సోమవారం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్ జరుగుతుంది. మన రాష్ట్రంలోని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్రకుమార్ పదవీ కాలం ఏప్రిల్ 4వ తేదీతో పదవీకాలం ముగుస్తుంది. సీఎం రమేష్ తెలుగుదేశంలో ఉండగా ఆ తర్వాత చంద్రబాబు ఆదేశాలతో బీజేపీలో చేరారు. కనకమెడల రవీంద్రకుమార్ బాబుకు న్యాయ సంబంధిత విషయాల్లో సలహాలు ఇస్తుంటారు. పలు కేసులను చూస్తున్నారు. టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో మిగిలింది ఈయన మాత్రమే. వేమిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే మూడు స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో టీడీపీ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది.