తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తీరు ఎలా ఉంటుంది అంటే పైకి తల్లికి వందనం, స్త్రీ శక్తీ అంటూ పథకాలు ప్రకటిస్తూ మహిళోద్దారకులుగా మాట్లాడుతూనే లో-లోపల మాత్రం ఆడవారిపైన ఆఘాయిత్యాలు చేస్తునే ఉంటారు.
టీడీపీ అధికారంలో ఉండగానే ఇలాంటి ఎన్నో సంఘటనలు చూసాం లావణ్య హత్య నుండి రిషితేశ్వరి ఆత్మహత్య వరకు, ఎమ్మార్వో వనజాక్షి పై దాడి నుండి మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్, టీడీపీ మహిళా నేత శ్రీదేవి ఆత్మహత్య వరకు ఎన్నో చూసాం, కానీ ఒక్కరోజు కూడా వీరిపై చంద్రబాబు సరిగ్గా స్పందించిన పాపన పోలేదు. ఇది చంద్రబాబు అధికార అహంకారానికి ప్రతిరూపం అని అందరు అనుకున్నరు, కానీ ఇప్పుడు అధికారంలో లేకున్నా ఆడవారిపైనా టీడీపీ వారు చేస్తున్న ఆఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. కార్యకర్తలను క్రమశిక్షణలో పెట్టడం పోయి అలాంటి కార్యక్రమాలు పాల్పడే వారికి టీడీపీ పార్టీ వారే సహకరిస్తున్నట్లు ఉంది.
స్వయాన తన బావమరిది హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక వేదిక పైన మాట్లాడుతూ ఆడవాళ్లు కనిపిస్తే ముద్దైన పెట్టాలి కడుపైన చేయాలి అన్న మాటలు బహిర్గంగానే అన్నాడు ఆడవారి పైన ఇంతటి స్టేట్మెంట్ ఇచ్చిన వారు ఆడివారి హక్కులును ఏ మాత్రం కాపాడుతారు . ఆడవారి రక్షణ కోసం అధికార వైస్సార్సీపీ పార్టీ దిశా చట్టంను తీసుకొనే వస్తే, దాని పైన కూడా కోర్టుకి వెళ్లి స్టే తెచ్చిన ఘనత టీడీపీకే చెందుతుంది. ఇలాంటి పార్టీలు మహిళల కోసం అంత చేస్తాం ఇంత చేస్తాం అంటే జనాలు నమ్మాలి. ఇలాంటి పార్టీకి భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు.
ప్రస్తుత విషయానికి వస్తే కుప్పం నియోజక వర్గంలో రామకుప్పం మండలం బల్ల గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త సెల్వరాజ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయంతో బాలిక బిగ్గరగా ఏడుస్తూ కేకలు పెట్టడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి బాలికను కాపాడి గ్రామస్తులు సెల్వరాజ్‌కు దేహశుద్ధి చేశారు. బాలిక తల్లిదండ్రులు సోమవారం రాత్రి రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ శివకుమార్ సెల్వరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఒక్క సంఘటనే కాదు ప్రతిపక్షంలో ఉంటూనే టీడీపీ గడిచిన 5ఏళ్లలలో ఇలాంటి ఎన్నో సంఘటనులకి పాల్పడింది అవి ఒకసారి చూస్తే.
మహిళలపై 2019 నుంచి టీడీపీ కీచకుల చేసిన అఘాయిత్యాల లిస్ట్:-
1) 2019 నవంబర్ 16:- అనంతపురం జిల్లా చిలమత్తూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శ్రీనివాస్ మహిళలను టార్గెట్ చేసి వేదింపులకు గురిచేయడమే కాకుండా ఆరుగురు మహిళలను అత్యాచారం చేశాడు.
2) 2020 ఫిబ్రవరి 20:– కర్నూల్ జిల్లా అవుకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సభ్యసమాజం తలదించుకునేలా 14 ఏళ్ల బాలుడిపై పైశాచికంగా లైంగికదాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త బుల్లెట్ రాజు.
3) 2021 జనవరి 9:- మూడేళ్లుగా టీడీపీ కార్యకర్త పద్మాచారి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు టీడీపీ పాలనలో కేసు పెట్టినా పలుకుబడితో ఒక్కరోజులోనే బయటకు వచ్చి నరకం చూపిస్తున్నాడని కన్నీరు పెట్టుకున్న అనంతపురం సోమందేపల్లి కి చెందిన యువతి.
4) 2022 జనవరి 28:- పార్టీలో ఉన్న మహిళలపై టీడీపీ నాయకులు, లోకేష్ పీఏ సాంభశివరావు టీం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ముందు ధర్నా చేసిన పెదవడ్లపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు కృష్ణవేణి పాలేటి.
5) 2022 జనవరి 30:- 14ఏళ్ల బాలికపై లైంగిక వేదింపులకు పాల్పడి ఆమే ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన విజయవాడకు చెందిన టీడీపీ నేత వినోద్ జైన్.
6) 2022 ఫిబ్రవరి 9:- అనంతపురం ఉరవకొండ, రాకెట్ల తండాకు చెందిన టీడీపీ కార్యకర్త రామావత్ చంద్రా నాయక్ ఒంటరిగా ఉన్న బాలకపై అత్యాచారంచేసేందుకు ప్రయత్నించాడు బాలిక వెంటనే అప్రమత్తమై తలుపులు వేయడంతో పోలీసులకి దోరికిపోయాడు.
7) 2022 ఏప్రిల్ 28:– గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని. తన స్నేహితుడు శివసత్య సాయిరామ్ కోరికను కూడా తీర్చాలని ఆమెను వేధించాడు. అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను దారుణంగా హత్యచేసిన టీడీపీ కార్యకర్త, నారా లోకేశ్ యూత్ టీమ్ సభ్యుడు కొర్రపాటి వెంకటసాయి సతీష్ చౌదరి.
8 ) 2022 ఏప్రిల్ 29:– దుగ్గిరాల మండలం శృంగారపురంలో మహిళా కూలీపై అత్యాచారయత్నం చేసిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త మల్లెల కిరణ్.
9) 2022 జులై 21:– వివాహితను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా. వివాహిత భర్తను బెదిరింపులకు గురిచేశిన ధర్మవరం చారుగుండ్ల ఓబిలేసు. దీంతో ఆమే భర్త మనస్థాపంతో ఆత్మహత్యయత్నం చేశాడు. రైల్వే ట్రాక్‌పై సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
10) 2022 జులై 21 :– కావలి మండలంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని పట్టణంలో బీసీ హాస్టల్లో ఉంటూ ఒక ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే హైస్కూల్లో టీడీపీ కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసంతి భర్త ద్రోణాదుల వెంకట్రావు అలియాస్ గాబరా వెంకట్రావు రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తనను గాబరా వెంకట్రావు కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విషయం చెప్పడంతో గుట్టుచప్పుడు కాకుండా వెంకట్రావును సస్పెండ్ చేశారు.
11) 2022 జూన్ 8 :- కుప్పంలో ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార్యకర్త శ్రీధర్ లైంగిక దాడి, శిక్షించాలని ప్రజా సంఘాలు ర్యాలీ , శ్రీధర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.
12) 2022 అక్టోబర్ 5:- శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ లైంగిక వేధింపులకు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సుధారాణి.
13) 2022 డిసెంబర్ 27:- పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీలో తొమ్మిదేళ్ల బాలికపై చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి సమీపంలోని ఓ ఇంట్లోకి తీసుకువెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ టీడీపీ సోషల్ మీడియా గ్రామ కో–ఆర్డినేటర్ వినుకొండ అశోక్‌బాబు లైంగికదాడికి ప్రయత్నించడంతో ఆ చిన్నారి కేకలు వేసింది. దీంతో అశోక్‌బాబు పారిపోయాడు.
14) 25 జనవరి 2023:- డోన్‌కు చెందిన టీడీపీ నేత తనతో అసభ్యంగా వ్యవహరించారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని టీడీపి అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోయే సరికి ఆ పార్టీకి రాజీనామా చేసిన భీమిలి నియోజకవర్గం 5వ వార్డుకు చెందిన తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు గోడి అరుణ.
15) 2023 ఆగస్ట్ 3:- సోదరుడి వరుసైన వ్యక్తితో కలసి తీసుకున్న వీడియోలు, ఫొటోలను చూపిస్తూ. కోరిక తీర్చకపోతే అందరికీ పంపుతాను తప్పుగా ప్రచారం చేస్తానని బెదిరించి. లైంగిక దాడికి పాల్పడిన అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్ మార్కెట్ మహేష్.
16) 2023 సెప్టెంబర్ 21:- ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడి. ఆటోలో నుంచి బయటకు లాక్కెళ్లి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేసిన ధర్మవరం మండలం గొట్లూరులో టీడీపీ నేత భాస్కర్.
17) 2023 నవంబర్ 25 :- గుంటూరు స్వర్ణభారతీనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత చల్లా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న లక్ష్మీనారాయణని అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు టీడీపీ పార్టీ కార్యాలయంలో దాచి అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ సమక్షంలోనే దాడికి యత్నించారు.
18) 2023 డిసెంబర్ 8:- యాచక వృత్తి చేసుకుంటూ కదిరి బస్టాండ్ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కదిరి నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత అనుచరుడు, నంబూల పూలకుంటకు చెందిన ఐటీడీపీ సభ్యుడు వేలూరి సతీష్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
19) 2023 డిసెంబర్ 11:- విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ఒంటరిగా నివసిస్తున్న పరిచయం ఉన్న ఓ మహిళపై యాసిడ్ పోసి ఆమె బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించిన టీడీపీ అధ్యక్షుడు చీపురపల్లి నరసింగరావు
తెలుగుదేశం కార్యకర్తలు , నాయకులు మైనర్లు పిల్లలు అని కూడా చూడకుండా నిత్యం కీచకపర్వానికి తెర్తీస్తూ రాష్ట్రంలో మృగాల్లాగా తిరుగుతుంటే వారి అధినేత చంద్రబాబు నుండి మాత్రం కనీసం ఒక స్పందన కూడా రాదు. ఇటువంటి వారికి అధికారం అనే ఆయుధం ఇస్తే రాష్ట్రంలో ఎందరో రిషితేశ్వరీలు మరెందరో సాయిశ్రీలు మన కళ్ళముందే బూడిదైపోతారు.. మాహిళా లోకం జర భద్రం …