కృష్ణాజిల్లా నేతలు చంద్రబాబుకి షాక్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ తో కలిసి నిర్వహిస్తున్న తాడేపల్లిగూడెం తెలుగు జన విజయకేతనం సభకు అవని గడ్డ తమ్ముళ్ళు డుమ్మా కొట్టారు. అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగడంతో ఇన్నిరోజులు పార్టీకోసం కష్టపడి పనిచేసిన మేము పొత్తుల మంటలో కాలిపోవటానికి సిద్దంగాలేమని ప్రకటించారు.
ఇప్పటికే తొలిజాబితాలో తన పేరు లేకపోవడంతో అవనిగడ్డ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మండలి బుద్ధప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అడుగు ముందేకేసి టీడీపీ , జనసేన సభకు అవనిగడ్డ టీడీపీ శ్రేణులు మొత్తం దూరంగా ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్‌పై స్పష్టత ఇవ్వల్సిందే అని, అది వచ్చేవరకు తాము ఏ కార్యక్రమంలో పాల్గోకుండా తెలుగుదేశం నిర్వహించే అన్ని కార్యక్రమాలను బాయికాట్ చేస్తామని చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు.
చంద్రబాబు తాను ఎంతో ఆలోచించి 40ఏళ్ల తన రాజకీయ చరిత్రలో ఎన్నడు చేయని విధంగా కసరత్తు చేసి టికెట్లు ప్రకటిస్తున్నా అని చెప్పుకున్నాక కూడా ఇలా అసంతృప్తులు గతంలో ఎన్నడు లేనంత ఎక్కువగా చంద్రబాబు నిర్ణయంపై తిరుగుబాటు జరపడం చూస్తే .. ఆయన వయస్సు రిత్యా రాజకీయ చదరంగంలో వెనకపడిపోయి. కొత్త తరహా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందుతునట్టుగా కనిపిస్తుందని .. ఇక ఆయన పార్టీ పగ్గాలను వదిలేస్తేనే మంచిదని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు.
పరిస్థితి చూస్తుంతే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయానికి జగన్ ఒక ఎదుర్కోలేని పెను సవాల్ గా మారినట్టు కనిపిస్తుంది. ఇక చంద్రబాబు రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చినట్టే అని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా వినిపిస్తుంది