యర్రగొండపాలెంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతున్నది. నియోజకవర్గ కీలక నేత గత రెండు ఎలక్షన్ లో టీడీపీ తరుపున యర్రగొండపాలెంలో పోటి చేసి ఓడిపోయిన అజితారావు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గత పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా వుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ పెద్దలు సహకరించకపోయినా పార్టీని కాపాడుకుంటూ వచ్చిన అజితారావును రెండు సార్లు ఓడిపోయారు ఓడిపోయారు అంటూ కొంత కాలం క్రితం నియోజకవర్గ ఇంచార్జ్ గా తొలగించి కనిగిరికి చెందిన గూడూరి ఎరీక్షన్ బాబుకు యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గా అవకాశం కల్పించారు. అప్పటి నుండి టీడీపీ లో ముసలం మొదలయింది. ఇప్పుడు ఎరీక్షన్ బాబు ఒంటెద్దు పోకడలతో నియోజకవర్గంలో టీడీపీ పోటీకి ముందే చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది.
అజితారావు 2014,19 లో టీడీపీ తరుపున పోటీ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది తనకంటూ ఓక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఇప్పుడు వీరంతా తనతో పాటు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అజితారావు కాంగ్రెస్ లో చేరి పోటి చేస్తూ వుండడంతో టీడీపీ లోని ఒక వర్గం మొత్తం దూరం అయ్యారు . అలాగే మరో ముఖ్య నాయకుడు అయిన డాక్టర్ మన్నె రవీంద్ర కూడా టీడీపీ కి దూరంగా వున్నారు. ప్రస్తుత ఇంచార్జ్ ఎరీక్షన్ బాబు అందరినీ కలుపుకుపోకుండ ఒంటెద్దు పోకడలతో కించ పరచడం , గ్రామాలకు ప్రచారానికి సమాచారం ఇవ్వకుండా తనే వెళ్లడంతో ఇక టీడీపీకి తన అవసరం లేదు అని భావించిన మన్నె రవీంద్ర అతని వర్గం సైలెంట్ అయిపోయారు. దీనితో టీడీపీకి గ్రౌండ్ లో బలం లేదని తెలుసుకున్న ఎరీక్షన్ బాబు ఏమి చెయ్యాలో అర్ధం కాక తల పట్టుకొని కూర్చున్నారు. అసలు పోటీ చెయ్యాలో వద్దా అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక వైసీపీ పార్టీ తమ అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ కు టికెట్ కేటాయించడంతో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. వైసీపీ పార్టీకి నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ వుండటం, పార్టీ నేతలు అండదండలతో ప్రచారంలో టీడీపీకి అందనంత దూరంలో వున్నారు. టీడీపీ ఏమో కార్యకర్తలు , నాయకుల బలం లేక అగమ్య గోచరంలో వున్నారు.