ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ తరపున పోటీ చేసే నాయకులకు వరుసగా వెన్నుపోట్లతో భారి షాక్ లు ఇస్తున్నారు. ఇప్పుడు తన సొంత జిల్లాలో పదుల కోట్లు ఖర్చు పెట్టించి ఇప్పుడు కులం గొడవ పేరుతో గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి థామస్ కు వెన్నుపోటు పొడుస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ నుండి ఆర్ గాంధీతో నామినేషన్ దాఖలు చేపించారు అంతటితో ఆగకుండా వెదురు కుప్పంకు చెందిన డాక్టర్ గ్యాస్ రవికుమార్ తో కూడా నామినేషన్ దాఖలు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితో పాటు పాలసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ అయిన రాజేంద్ర కూడా టికెట్ రేసులో నేనున్న అంటూ నామినేషన్ వెయ్యడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా టీడీపీ ముఖ్య నాయకులతో పోటీకి సిద్ధం గా వుంచి చివరకు ఎవరికి పార్టీ బి ఫారం ఇస్తారో తెలియని పరిస్థితిలో ఆయా నేతలు టెన్షన్ తో ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే టీడీపీ అభ్యర్థి థామస్ ఎస్సీ కాదు అతను క్రిష్టియన్ అని ఆధారాలతో సహా పలువురు ఎలక్షన్ కమీషన్ తో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేశారు. వీటి మీద ఎలక్షన్ కమీషన్, కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తను చదువుకున్న టీసీలో వడింగడు మునస్వామి అని పాస్ పోర్ట్ లో మాత్రం థామస్ పేరుతో వున్నది అని లోకల్ తహశీల్దార్ రిపోర్ట్ పంపించారు. అయితే హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్ మరిన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసారు . 2011 జూన్ పదవ తేదీన తను మతం , పేరు మార్చుకున్నట్లు , తను చెన్నై లో జన్మించినట్లు 2012 అక్టోబర్ 17న తమిళనాడు గెజిట్లో ప్రకటన చేసారు. మళ్ళీ రాజకీయ పరంగా ఇబ్బందులు వస్తాయిని 2024 ఫిబ్రవరి 23వ తేదీన నన్ను వడింగాడు మునస్వామీ థామస్ గా పిలవచ్చు అంటూ కొత్త గెజిట్ ప్రకటించారు.
ఇలా తమ అభ్యర్థి థామస్ అలియాస్ మునిస్వామికి నియోజకవర్గంలో కులం పేరుతో గొడవలు జరుగుతున్నాయి పోటీకి అనర్హుడు అని తెలిసిన చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా లోకల్ నాయకుల మాటలకు విలువ లేకుండా తనకే టికెట్ అని ప్రకటించి గత నాలుగు నెలల్లో పదుల కోట్లు ఖర్చు పెట్టించి ఇప్పుడు మాత్రం కులం సమస్య అవుతుందనే సాకుతో వేరే నాయకులను పోటీకి రంగంలోకి దింపుతన్నారు. బాబు చేస్తున్న డబుల్ గేమ్ వలన తన నామినేషన్ ఎలక్షన్ కమీషన్ రిజెక్ట్ చేస్తే పరిస్థితి ఏమిటో అని గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థి అయిన థామస్ ఇప్పటి నుండే బాధ పడుతున్నారు.