టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి పనులకు పాల్పడుతుందనేది ఈమధ్య వెలుగులోకి వచ్చింది. 2019 ఎన్నికలలో దొంగ ఓట్ల గురించి కీలకమైన ఆధారాలు లభించాయి.
వాస్తవానికి నల్లధనం కేసుతో మొదలైన వ్యవహారం దొంగ ఓట్ల తో కొలిక్కి వచ్చింది.. జీఎస్టీ ఎగవేస్తున్న కంపెనీల జాబితాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ జాబితాను రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జాబితాలో ఉన్న పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో జనవరి 24 న డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు, రశీదులు, ఇన్వాయిస్లు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వివరాలేవీ ఆ కంపెనీలో దొరకలేదు.. అసలు ఆ కంపెనీ వ్యాపార కార్యాకలాపాలను నిర్వహిస్తున్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు..
కానీ ఆ సోదాల్లో 2019 ఎన్నికలకు సంబంధించిన ఓ డైరీ దొరికి ఎన్నికల్లో టీడీపీ నేతల నల్లధనం పంపిణీ గుట్టును రట్టు చేసింది. 2019 ఎన్నికల్లో నల్లధనం వెదజల్లి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. అందుకోసం ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసిన నగదు వివరాలు అన్నీ పోలింగ్ బూత్‌లవారీగా నమోదు చేసి ఉన్నాయి. ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు కాకుండా నల్లధనం చలామణి సాగిస్తున్నట్లు డైరీతో పాటు అక్కడ లభ్యమైన మరికొన్ని కీలక ఆధారాలు వెల్లడించాయి. అందుకోసమే కంపెనీ బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించాలని కోరుతూ కేంద్ర ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లకు డీఆర్ఐ అధికారులు నివేదించారు. దాంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 123 (1), ఐపీసీ సెక్షన్ 171(ఇ) రెడ్ విత్ 120(బి), సీఆర్పీసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు తో సహా పలువురు పరారీలో ఉన్నారు.
ఈ సాంబశివరావు పై అనేక కేసులు ఉన్నాయి. రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయించడం, నీరు-చెట్టు పనుల్లో కోట్ల రూపాయలు దండుకోవడం, దళితులకు కేటాయించిన భూముల్లో చెరువులు తవ్వించేందుకు యత్నించడం, గ్రానైట్ పరిశ్రమల అవకతవకలు అంటూ చాలా కేసులున్నాయి.. ఇప్పుడు దొంగ ఓట్ల వ్యవహారం.. పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి 15 వేలకుపైగా దొంగ ఓట్లు చేర్పించారు. ఇటీవల సదరు దొంగ ఓట్లపై ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు.