ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి ప్రచారం చేస్తుందని బిజెపిసీనియర్ నేత రఘునాథ్ బాబు మీడియాతో తెలిపారు. కూటమిలో భాగంగా జనసేన టిడిపిలో ఉన్నప్పుడు బిజెపి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని తెలిపారు. భూ రికార్డు డిజిటలైజేషన్ ద్వారా చాలా కాలం నుంచి ఉన్న సమస్యలకి పరిష్కారం ఈ యాక్ట్ ద్వారా లభిస్తుందని ఆయన తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఉందని దుష్ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదని తెలిపారు.
కాగా రఘునాథ్ బాబు మాట్లాడుతూ టిడిపి జనసేన పార్టీలు తీసుకొచ్చిన మేనిఫెస్టోను వాళ్ల ఉమ్మడి మేనిఫెస్టోగా మాత్రమే పరిగణించాలని ఆయన తెలిపారు. మేనిఫెస్టో పైన గమనిస్తే బీజేపీ వాళ్ళవి ఫోటో కూడా ఉండదని ఆయన తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోకి మా మద్దతు లేదని ఆయన వెల్లడించారు. బిజెపి పాలసీల అనుగుణంగా మేనిఫెస్టో రూప కల్పన జరగలేదని అని అన్నారు. 2014లో మేనిఫెస్టో పైన మోడీ బొమ్మ వేసి మా మద్దుతున్నట్లు ఆరోజు చంద్రబాబు నాయుడు ప్రకటించుకొన్నాడు కానీ మేనిఫెస్టో ఆరోజు కూడా మా ప్రమేయం ఏమీ లేదు .. ఆ మేనిఫెస్టో మాకు ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇతర పార్టీల నాయకుల నుంచి మాటలు పడాల్సి వస్తుందని అని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అంశంలో క్రెడిబిలిటీ కోల్పోయిన నాయకుడు అని ఈ సందర్భంగా తెలిపారు. కూటమిలో అంతర్గత కుమ్ములాట రోజు రోజుకి బయట పడుతుండడంతో ఒకరి మద్దతు ఒకరికి లేదని స్పష్టంగా అర్థమవుతోంది.