గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఒక సామాన్య ప్రయాణికుడిలా హైదరాబాద్ రైల్వే స్టేషన్లో కనిపించారు. దీనికి గానూ సాధారణ ప్రయాణికుడిలా రైల్వేస్టేషన్లో అశోక్ గజపతిరాజు అంటూ పచ్చ మీడియా పెద్ద బిల్డప్ నాటకాలు ఆడుతుంది.. మరీ ఇంత సింప్లిసిటీనా.. అంటూ పొగడ్తలతో ముంచేస్తుంది.
అధికారం ఎప్పుడూ ఆయనను తప్పుదోవ పట్టించలేదంటూ తెగ డబ్బాలు కొడుతుంది టీడీపీ పార్టీ.. నిజానికి అశోక్ గజపతి రాజు గారు.. అధికారంలో ఉండి ఏవిఏషన్ మినిస్టర్ గా ఉంటూ , విమానంలోకి నిషేదిత వస్తువైన అగ్గిపెట్టెను తీసుకుని వెళ్ళి , దీనిని తప్పు అని అధికారులు అంటే నా ఇష్టం అని బుకాయించారు. ఆ విషయాన్ని ఆయనే జూలై 2, 2015 న మీడియా ముఖంగా చెప్పారు.
”నేను సిగరెట్లు కాలుస్తా. విమానశ్రయాల్లో నన్ను తనిఖీ చేయడం మానేయగానే అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్తున్నా” అంటూ డైరెక్ట్ గా మీడియాకే చెప్పారు. అంటే అక్కడే ఆయనెప్పుడూ రూల్స్ పాటించలేదని అర్ధమవుతుంది.. అధికారాన్ని ఇలా అడ్డదిడ్డంగా వాడటం టీడీపీ నాయకులకు అలవాటే..
ఒక్కసారి అధికారం లేనప్పుడు సామాన్యులుగా రైల్వేస్టేషన్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తే పెద్ద సింప్లిసిటీ అయిపోతుందా.. ఈ డ్రామాలు ప్రజలు నమ్మే రోజులన్నీ ఎప్పుడోపోయాయి..
టెక్నాలజీ చేతుల్లోకి వచ్చాక ఎవరి గుట్టైనా ఇట్టే అరచేతిలోకి వచ్చేస్తుంది..