కిందపడినా నాదే పై చేయి, తప్పు చేసినా అదే ఒప్పు, తప్పు చేసినట్లు ఆధారాలు దొరికితే అది నా తప్పు కాదు ననేను తప్పు చేస్తుండగా పట్టుకున్న వారిది అంటూ వితండ వాదన చేసే బాబు కు ఎల్లో మీడియా డప్పు సహకారం అందిస్తుంటుంది..
వైజాగ్ పోర్ట్ లో దొరికిన డ్రగ్స్ కంటైనర్ సంధ్య ఆక్వా కి చెందినది అని తెల్సిన వెంటనే తాము చిక్కుల్లో పడ్డామని అర్థం అవ్వగానే బుజాలు తడుముకుంటూ రాష్ట్రం డ్రగ్స్ మయం అయ్యింది అంటూ, జగన్ ప్రభుత్వం డ్రగ్స్ దందా ని ప్రోత్సహిస్తుంది అంటూ తెగ హడావిడి చేసారు తీరా చూస్తే ఆ సంధ్యా ఆక్వా యాజమానం మొత్తం మనోళ్లదే అర్థం అయ్యాక కనీసం వారి పేర్లు కూడా సరిగా రాయకుండా జాగ్రత్త పడుతున్నారు..
సంధ్యా ఆక్వా కమ్మ వారిది కాబట్టి ఈనాడు, ఆంధ్ర జ్యోతి వాళ్ళ పేర్లు రాయలేదుఅదే వేరే ఎవరిదైనా అయ్యుంటే అయి ఉంటే… వారి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల్లో ఎక్కడైనా జగన్ కు కిలోమీటర్ దూరం నుండి చుట్టాలు అయినా డైరెక్ట్ గా జగనే ఆ సంస్థ యజమాని అన్నట్లుగా రాసుకొస్తారు..కానీ బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్‌ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా యాజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు అని తేలడం..
ఆ సంస్థ ఒకానొక యజమాని మరియు లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన దామచర్ల సత్యం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ సోదరుడు కావడం, అతను రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి) లకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడం. ఆలపాటి రాజా తో వ్యాపార బంధం, బాలయ్య చిన్నల్లుడు భరత్ కుటుంబంతో దోస్తీ ఉండటం తో ఆ విషయాలు ఏవీ తమ పత్రికల్లో అచ్చేయకుండా ప్రపంచానికి తెలియకుండా చేసాం అని సంబర పడిపోతుంటారు…
అలాగే సంధ్యా ఆక్వా కంపెనీతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురందేశ్వరి కుమారుడు చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగా కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ దందాలో తీగ లాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. కానీ ఇవేమీ వారి పత్రికల్లో కనపడవు… అయినా ప్రజలకు నిజాలు తెలియకుండా ఉంటాయా..
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం లో కూడా సంధ్యా ఆక్వా పాత్ర ఉందని ప్రాథమిక ఆధారాలు లభ్యం అయ్యాయి…ఈ మొత్తం ఉదంతంపై వైసీపీ సమగ్ర విచారణకు ఎన్నికల కమీషన్ ను, సీబీఐ ని కోరింది… ఏమైనా డ్రగ్స్ కంటైనర్ తీగ లాగితే బాబు అండ్ కో ల అక్రమ దందాల డొంక అంతా కదిలింది…