ఎన్నికలకి ముందే పొత్తుల రాజకీయంలో జనసేన చిత్తుగా ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న జనసైనికులు చంద్రబాబు విదిల్చిన 24 సీట్లను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తమకి బలం ఉన్న సీట్లను కూడా టీడీపీ వాళ్ళు గద్దలా తన్నుకుపోతుంటే చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏంటనే అంతర్మదనం వారిలో మొదలైంది. సీట్ల సర్దుబాటు విషయం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచినట్టు కనిపిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు
మరీ ముఖ్యంగా ఉత్తరాంద్రలో టీడీపీ సీనియర్ లీడర్ల మాటలకి పవన్ కళ్యాణ్ తలవంచాడనే వాదన బలంగా ఉంది. దీనికి కారణం విజయనగరంలో జనసేన తరుపున పాలవలస యశస్వి గారికి సీటు నిరాకరించి , నెల్లిమర్ల లో మాత్రం జనసేన తరుపున లోకం నాగ మాధవి గారికి టికెట్ కేటాయించడమే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. 2019లో పోటీ చేసి 7,190 ఓట్లు సాధించిన పాలవలస యశస్వి గారికి ఓటు బ్యాంక్ లేదని సీటు నిరాకరించి టీడీపీ సీనియర్ లీడరైన అశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతి రాజుకు కేటాయించించారు.
పాల్వాయి యశ్వసీ గారిలాగే నెల్లిమర్ల లో కూడా లోకం నాగ మాధవి గారు 2019లో పోటీ చేసి కేవలం 7,633 ఓట్లు మత్రమే సాదించారు. అయితే ఆమెకు ఎలా సీటు ఇచ్చారు అంటే నెల్లిమర్లలో టీడీపీకి ధనబలం ఉన్న అభ్యర్ధి లేరు కాబట్టి ధనభలం ఉన్న లోకం నాగ మాధవిని అభ్యర్ధిగా ప్రకటించారా పవన్ కళ్యాణ్ . ఇక్కడ కూడా టీడీపీకి బలమైన అభ్యర్ధి ఉంటే పాలవలస యశస్వి గారికి ఎలా సీటు పోయిందో అలాగే ఈమెకు మొoడి చేయి చూపించేవారా .. ఇదేనా ఈయన వీర మహిళలకు ఇచ్చే గౌరవం. డబ్బు ఉంటేనే టికెట్ అని ముందే ప్రకటిస్తే స్థాయి స్తోమత చూసుకుని వచ్చేవాళ్లం కదా అని జనసైకుల నుండి వస్తున్న ప్రశ్న .. ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానలు ఉన్నాయో లేదో చూడాలి.