మహిళలను మోసం చేసేందుకు మోసపూరిత హామీలు..
అధికారం కోసం పక్క పార్టీ హామీలపై ఆధారపడే నైజం..
మామూలుగానే మైకు పట్టుకుంటే మాటలు కోటలు దాటే చంద్రబాబు నాయుడికి.. మేనిఫెస్టో, హామీలు అంటే మరీ చిన్నచూపు. అసలు చెయ్యగలమా లేదా అనే ఆలోచన లేకుండా ఎడాపెడా హామీలిచ్చేయ్యడం తరువాత మేనిఫెస్టోను కనపడనియ్యకుండా దాచెయ్యడం టీడీపీ ప్రత్యేకత.. నాయకుడంటే ప్రజలకు తోడుండాలి.. కష్టమొచ్చినా నష్టమొచ్చినా మాట తప్పకూడదు మడమ తిప్పకూడదు.
కానీ అలాంటి ఆలోచన ఏ కోశానా లేని పద్ధతి తెలియని చంద్రబాబు ఏధైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే చాలు అక్కడి పార్టీలు ఏ హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచారో అవన్నీ ఏరుకొచ్చుకొని ఆ కాగితాలన్నీ దారంతో కుట్టి ఒక మేనిఫెస్టో తయారు చేసి నా మదిలో నుండీ మీకోసం పుట్టిన పధకాలు అంటూ అది ప్రజల మీదకు వదులుతాడు. అలానే కర్ణాటక కాంగ్రెస్ , బీజేపీ ఇచ్చిన హామీలని కలిపేసి ఓ ఎనిమిది హామీలతో మేనిఫెస్టో తయారు చేసి 2024 ఎన్నికల కోసం 2023, మే లోనే టీడీపీ మిని మేనిఫెస్టో అంటూ ఒకటి రిలీజ్ చేశారు.
అందులో భాగంగా “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తామని హామీ ఇచ్చారు. అయితే హామిలిచ్చి అవి సక్రమంగా అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. 2014 ఎన్నికలలో గెలిచిన చంద్రబాబు ఆ ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానాలను 2019 ఎన్నికలకు 2 నెలల ముందు నెరవేర్చడం మొదలు పెట్టాడు. ఎన్నికలు రాబోతున్నాయంటే తప్ప ప్రజలను పట్టించుకోని చంద్రబాబు గతంలో వైసీపీ నవరత్నాలులో పించన్ల పెంపు పధకాన్ని కాపీ కొట్టి ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు మాత్రమే 2000 పెన్షన్ ఇచ్చాడు. అలాంటి బాబు ఇచ్చిన హామీలనే జనం నమ్మక నవ్వుల పాలవుతుంటే యువగళం అంటూ పాదయాత్ర చేస్తున్న లోకేష్ రీసెంట్ గా యువతతో ముఖాముఖిలో విద్యార్ధులకు బస్సు ప్రయాణం ఉచితం అంటూ మాటిచ్చాడు.
వీరికి ముందు మాట ఇచ్చేయ్యడం తరువాత ఆ మాటలను గాలిలో కలిపెయ్యడం మామూలే.. అదీ లోకేష్ మాటలైతే అసలు నమ్మలేని విధంగా తయారయ్యాడని చెప్పొచ్చు . యువగళంలో సీమలో జరిగిన ఒక సభలో డ్వాక్రా రుణమాఫీ చేసామని చెప్పిన గొప్ప సత్యశీలి నారా లోకేష్. ఇప్పుడు మాట్లాడిన మాట రెండోరోజు గుర్తుంచుకోలేని గొప్ప వ్యక్తి . 2024 లో అధికారంలోకి వస్తే 2029 ఎన్నికల ముందు వరకూ హామీలు అమలు చెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యదు టీడీపీ..
టీడీపీ పార్టీని, చంద్రబాబును నమ్మి ఇప్పటికే ప్రజలు చాలాసార్లు మోసపోయారు. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. హామీలు అమలు చెయ్యకపోగా ఆ అంశం పై ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే తోలు తీసేస్తా, తాట తీసేస్తా అంటూ చంద్రబాబు వార్నింగులు ఇవ్వడం లాంటి సంఘటనలు చాలానే జరిగాయి. టీడీపీ పార్టీకి ఓటెయ్యడం అంటే మన ఉరి మనమే వేసుకున్నట్టు అని లోకేష్ ఏ ముహుర్తాన అన్నాడో కానీ అదే నిజం చేస్తూ టీడపీ పరిపాలన చేసింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఓ కొత్త పద్ధతి నేర్పింది. మేనిఫెస్టోలో అన్ని పధకాలు అమలయ్యి మీకు మంచి జరిగితేనే మాకు ఓటెయ్యండి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు చెప్పారు. మరి 2014 ఎన్నికల మేనిఫెస్టోను తెచ్చి ప్రజలకిచ్చి ఇలానే అడిగే సాహసం చెయ్యగలదా టీడీపీ.